ప్రజావాణి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలి
ABN , Publish Date - Jun 22 , 2026 | 11:41 PM
ప్రజావాణి కార్యక్రమంలో అంది న దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించే విధంగా అధికారులు సమన్వయంతో కృషిచేయాలని కలెక్టర్ కె హరిత సూచించారు.
- కలెక్టర్ కె హరిత
ఆసిఫాబాద్, జూన్ 22 (ఆంధ్రజ్యో తి): ప్రజావాణి కార్యక్రమంలో అంది న దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించే విధంగా అధికారులు సమన్వయంతో కృషిచేయాలని కలెక్టర్ కె హరిత సూచించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవ న సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్, జిల్లా రెవెన్యూ అధికారి వేణులతో కలిసి అర్జీదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు.
సిర్పూర్9టి) మండల కేంద్రానికి చెందిన జువెల్ల హుస్సేన్ తనకు స్వాతంత్ర సమరయోఽ దుడి ధ్రువపత్రం ఇప్పించాలని కోరుతూ అర్జీ సమర్పించారు. కౌటాల మండలం వీర్దండి మాజీ సర్పంచ్ తాను పదవీ కాలంలో చేసిన పనులకు సంబంధించిన బిల్లులు ఇప్పించాలని కోరారు. కౌటాల మండలం మొగడ్‌దగడ్ గ్రామానికి చెందిన సుధాకర్ తనకు చెందిన ఆర్‌ఓఎస్‌ఆర్ పట్టా భూమిలో సోలార్ కనెక్షన్ మంజూరు చేయాలని దరఖాస్తు అందజేశారు. చింతలమానేపల్లి మండలం దిందా గ్రామానికి చెందిన విర్జు తన పట్టా భూమి నుంచి ఇతర వ్యక్తులు బలవంతంగా ఫెన్సింగ్ ఏర్పాటు చేశారని, ఈ విషయమై తగు చర్యలు తీసుకొని న్యాయం చేయాలని దరఖాస్తు చేసుకున్నారు. లింగాపూర్ మండలం భీమానాయక్‌తండాకు చెందిన సంగీత ఆశా వర్కర్ పోస్టు ఇప్పించాల ని, బెజ్జూరు మండలం సలుగుపల్లికి చెందిన లింగయ్య తెలంగాణ ఉద్యమంలో పని చేశానని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని దరఖాస్తు అందజేశారు. ఆసిఫాబాద్ మండలం గొడవెల్లి గ్రామానికి చెందిన కార్తీక్ తనకు దివ్యాంగుల పింఛన్ ఇప్పించాలని దరఖాస్తు అందజేశారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావా ణిలో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలని అధికారు లను ఆదేశించారు. కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
- నిరుపేదల జీవనోపాధికి చర్యలు
రాష్ట్రంలోని నిరుపేదల జీవనోపా దుల అభివృద్ధికి చర్యలు తీసువడం జరుగుతుందని సెర్ప్ ముఖ్య కార్య నిర్వాహక అధికారి దివ్యదేవరాజన్ అన్నారు. సోమవారం వీసీ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ ఆగాఖాన్ ఫౌండేషన్, బీఆర్‌ఏసీ ద్వారా టీజీఐఎల్‌పీ కార్యక్రమం కింద ఆసిఫాబాద్ జిల్లాలో తిర్యాణి మండలంలో 1257, లింగాపూ ర్‌లో 1474 మంది నిరుపేదలను గుర్తించామ న్నారు. వారందరికీ వారి అర్హతను బట్టి జీవోనో పాధులను ఎంపిక చేసి అమలుపరిచే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. కలెక్టరేట్ హరిత మాట్లాడుతూ తెలంగాణ సమ్మిళిత జీవనోపాదుల కార్యక్రమం కింద జిల్లాలో 2,731 మంది నిరుపే దలను గుర్తించామని తెలిపారు. డీఆర్‌డీవో దత్తారావు, ఉద్యానవన అధికారి నదీమ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.