Share News

‘సర్‌’కు రాజకీయ పార్టీలు సహకరించాలి

ABN , Publish Date - Jun 23 , 2026 | 11:25 PM

జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో ఎలాంటి పొరపా ట్లకు తావు లేకుండా రాజకీయ పార్టీల ప్రతిని ధులు సహకరించాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ కోరారు.

‘సర్‌’కు రాజకీయ పార్టీలు సహకరించాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

- కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

మంచిర్యాల కలెక్టరేట్‌, జూన 23 (ఆంధ్ర జ్యోతి): జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో ఎలాంటి పొరపా ట్లకు తావు లేకుండా రాజకీయ పార్టీల ప్రతిని ధులు సహకరించాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ కోరారు. కలెక్టర్‌ చాంబర్‌లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఈనెల 25 నుంచి జూలై 24 వరకు చేపట్టనున్న ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో రాజకీయ పార్టీలు భాగస్వాములు కా వాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ రా ములు, జిల్లా రెవెన్యూ అధికారి మోతిరాం, స్పెషల్‌ డిప్యూ టీ కలెక్టర్‌ చంద్రకళ, ఆర్డీవో శ్రీనివాసరావు పాల్గొన్నారు.

నాణ్యమైన విద్య అందించేందుకు కృషిచేయాలి

ప్రభుత్వ విద్యాసంస్థల్లో నాణ్యమైన విద్యను అందించేం దుకు కృషి చేయాలని కలెక్టర్‌ కుమార్‌దీపక్‌ సూచించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో అధికారులతో మంగళవా రం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన సౌకర్యా లను కల్పిస్తుందన్నారు. క్లస్టర్‌ రీసోర్స్‌పర్సనలు ప్రతీ రోజు ఒక పాఠశాలను తప్పనిసరిగా సందర్శించి విద్యార్థుల అభ్యాసన ప్రమాణాలను పరిశీలించాలన్నారు. ప్రభుత్వ పా ఠశాలలను బోధనేతర సిబ్బంది నిర్వహిస్తున్న విధులు, మధ్యాహ్న భోజనం, యుడైస్‌లో వివరాలను నమోదు చే యాలన్నారు. విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jun 23 , 2026 | 11:25 PM