Share News

పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి

ABN , Publish Date - Jun 04 , 2026 | 10:51 PM

పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలని డీఎల్‌పీవో ధర్మరాణి పేర్కొన్నారు. గురువారం కాన్కూర్‌, మిట్టపల్లి, ముదిగుంట, నర్వ, వెంకట్రావుపల్లి గ్రామాల్లో స్వచ్ఛ గావ్‌ సురక్షిత జలవాయు ప్రత్యేక గ్రామసభలను నిర్వహించారు.

పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి
నర్వ గ్రామంలో పర్యావరణ పరిరక్షణ ప్రతిజ్ఞ చేస్తున్న అధికారులు

- డీఎల్‌పీవో ధర్మరాణి

జైపూర్‌, జూన 4 (ఆంధ్రజ్యోతి) : పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలని డీఎల్‌పీవో ధర్మరాణి పేర్కొన్నారు. గురువారం కాన్కూర్‌, మిట్టపల్లి, ముదిగుంట, నర్వ, వెంకట్రావుపల్లి గ్రామాల్లో స్వచ్ఛ గావ్‌ సురక్షిత జలవాయు ప్రత్యేక గ్రామసభలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓటరు జాబితా ప్రత్యేక సవరణలో భాగంగా 18 ఏళ్లు నిండిన యువత ఓటరుగా నమోదు చేసుకోవాలని, మరణించిన వారి పేర్లను తొలగించాలని, పేరు, చిరునామాలో తప్పులుంటే బీఎల్‌వోల సహకారంతో సరి చేసుకోవాలన్నారు. ఘన పదార్థాల నిర్వహణలో భాగంగా తడి, పొడి, శానిటరీ ప్రత్యేక వ్యర్ధాల కోసం నాలుగు చెత్త డబ్బాలను ఏర్పాటు చేసుకుని సెగ్రిగేషన చేసి పంచాయతీ సిబ్బందికి అందించాలన్నారు. ప్లాస్టిక్‌ను వాడవద్దని, ఇంకుడుగుంతల వినియోగంపై అవగాహన కల్పించారు. చెత్తను రోడ్లపై వేసినా, కాల్చిన జరిమానాలు విధిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా స్వచ్ఛత ప్రతిజ్ఞ చేసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జైపూర్‌ సీఐ నవీనకుమార్‌, ఆర్‌డబ్య్లూఎస్‌ డీఈ విద్యాసాగర్‌, ఎంపీవో శ్రీపతి బాపురావు, ఎస్‌ఐ భూమేష్‌, సర్పంచులు, కార్యదర్శులు పాల్గొన్నారు.

కాసిపేట: స్వచ్చగావ్‌లో అందరూ భాగస్వాములు కావాలని రొట్టెపల్లి సర్పంచు ఆత్రం కళావతి అన్నారు. గురువారం రొట్టెపల్లిలో స్వచ్ఛగావ్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ర్యాలీ నిర్వహిస్తూ పర్యావరణంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జలం, వాయువును పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ప్రతి ఇంటిముందు ఇంకుడుగుంతలు నిర్మించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కార్యదర్శి ప్రసాద్‌, నాయకులు హన్మంతు, మహిళలు పాల్గొన్నారు.

Updated Date - Jun 04 , 2026 | 10:51 PM