ఆసిఫాబాద్‌లో భక్తిశ్రద్ధలతో కామదహనం
ABN , Publish Date - Mar 02 , 2026 | 11:54 PM
హోలీ పండగను పు రస్కరించుకుని సోమవారం ఆసిఫా బాద్ పట్టణంలోని పలు ఆలయాల కూడళ్ల వద్ద ప్రజలకు భక్తిశ్రద్ధలతో కామదహన కార్యక్రమం నిర్వహిం చారు.
ఆసిఫాబాద్‌రూరల్, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): హోలీ పండగను పు రస్కరించుకుని సోమవారం ఆసిఫా బాద్ పట్టణంలోని పలు ఆలయాల కూడళ్ల వద్ద ప్రజలకు భక్తిశ్రద్ధలతో కామదహన కార్యక్రమం నిర్వహిం చారు. పట్టణంలోని కేశవనాథస్వామి ఆలయంలో ఆలర్చకులు నరేష్ శర్మ ఆధ్వర్యంలో డోలోత్సవ కార్యక్రమం నిర్వహించారు. అలాగే బ్రాహ్మణ వాడ గణపతి దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అర్చకులు శిరీష్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి రాత్రి కామ దహన కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని గణేష్ మందిర్, సందీప్‌నగర్, పొట్టి శ్రీరాములు చౌక్, జన్కాపూ ర్, గొడవెల్లి, టీఆర్‌నగర్, రాజంపేటతో పాటు పలు కూడళ్ల వద్ద కామ దహన కార్యక్రమం నిర్వహించారు. కామ దహనం సందర్భంగా జాజిరి ఆటలతో కాలనీలు సందడిగా మారాయి. చిన్నా రులు బత్తీస పేర్లను మెడ లోహారంగా వేసి ప్రత్యే కంగా అలంకరించారు. ఆల యాలు సందడిగా మారా యి. ఆయా కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పాఠశాలల్లో హోలీ సంబరాలు
ఆసిఫాబాద్ పట్టణంలోని శ్రీసరస్వతీ శిశుమందిర్ పాఠశాలలో మాతృభారతి ఆధ్వర్యంలో ముందస్తు హోలీ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా హోలీ పండగ విశిష్టతను విద్యార్థులకు తెలియజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు సత్యనారా యణ, సభ్యులు రమాదేవి, వైష్ణవి, అఖిల, స్వాతి, ప్రధానోపాధ్యాయుడు కోటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
మండలంలో హోలీ పండగ సందడి
సిర్పూర్(టి), మార్చి 2(ఆంధ్రజ్యోతి): సిర్పూర్(టి) మండల కేంద్రంలో హోలీ పండగ సందడి నెలకొంది. మంగళవారం హోలీ పండగ నేపథ్యంలో పలువురు వ్యాపారులు రంగులు, పిచుకారిల దుకాణాలను ఏర్పాటు చేశారు. దీంతో చిన్న పిల్లలు, పెద్దలు కొనుగోలుకు రావడంతో సందడి నెలకొంది.