ఆన్‌లైన్ మందుల అమ్మకాలను నియంత్రించాలి
ABN , Publish Date - May 20 , 2026 | 11:47 PM
ఆన్‌లైన్ మందుల అమ్మకాలపై నియంత్రణ చేపట్టాలని మంచిర్యాల డిస్ర్టిక్ట్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు పేర్కొన్నారు.
- డిస్ర్టిక్ట్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు
- ప్రశాంతంగా మెడికల్ షాపుల బంద్
శ్రీరాంపూర్, మే 20 (ఆంధ్రజ్యోతి): ఆన్‌లైన్ మందుల అమ్మకాలపై నియంత్రణ చేపట్టాలని మంచిర్యాల డిస్ర్టిక్ట్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు పేర్కొన్నారు. దేశవ్యాప్త నిరసనలో భాగంగా మంచిర్యాల జిల్లాలో బుధవారం మెడికల్ షాపుల బంద్ ప్రశాంతంగా జరిగింది. మంచిర్యాల డిస్ర్టిక్ట్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్‌లో మెడికల్ షాపుల నిర్వాహకులు స్వచ్ఛందంగా షాపులు మూసివేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అసోసియేషన్ కోశాధికారి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ, ప్రభుత్వం తీసుకువచ్చిన నిబంధనలతో మెడికల్ షాపుల నిర్వాహకులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. కార్యక్రమంలో నాయకులు సమ్మయ్య, వెంకటేష్, రాజ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.
దండేపల్లి: మండలంలోని మేదరిపేట, తాళ్ళపేట, దండేపల్లి, ముత్యంపేట, వెల్గనూర్ గ్రామాల్లోని మెడికల్ షాపులను యజమానులు బుధవారం ముసివేసి బంద్‌లో పాల్గొన్నారు.
నస్పూర్/కాసిపేట: నస్పూర్ పట్టణంలో, కాసిపేటలో మెడికల్ షాప్ నిర్వహకులు దుకాణాలు మూసి వేసి నిరసన తెలిపారు. మెడికల్ షాపుల బంద్ ప్రశాంతంగా కొనసాగింది.
హాజీపూర్: లక్షెట్టిపేట మండల కేంద్రంలో మెడికల్ షాపుల బంద్ విజయవంతం అయింది. ఈ సందర్భంగా మెడికల్ షాప్స్ అసోసియేషన సభ్యులు స్థానిక తహాసీల్దార్ కార్యాలయంలో తహాసీల్దార్ దిలీప్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మెడికల్ షాప్స్ అసోసియేషన అద్యక్షుడు కొత్త కిరణ్‌కుమార్, ప్రధానకార్యదర్శి ఆది సతీష్, కార్యదర్శి జావెద్, సభ్యులు రమేష్, రాజేష్, రవి, కమర్, సంతోష్, రాజు పాల్గొన్నారు.
ఆనలైనలో మందుల కొనుగోలు చేయవద్దు
మంచిర్యాల కలెక్టరేట్: ఆనలైనలో మందుల కొనుగోలు చేయవద్దని మంచిర్యాల జిల్లా కెమిస్ట్ డ్రగ్గిస్టు జిల్లా అసోసియేషన అధ్యక్షుడు మోటూరి చంద్రశేఖర్‌రారావు, కార్యదర్శి తొగరి సుధాకర్ విజ్ఞప్తి చేశారు. దేశ వ్యాప్త మెడికల్ షాపుల బంద్‌లో భాగంగా బుధవారం మంచిర్యాల పట్టణంలోని మెడికల్ షాపులు బంద్ పాటించాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆనలైనలో మందులను విక్రయించడం వల్ల నష్టాలు జరుగుతాయన్నారు. కార్యక్రమంలో రాజేంద్రప్రసాద్, అశోక్, శేఖర్, బాలేశ్వర్‌రావు, శ్రీనివాస్, గోవింద్‌రెడ్డి, చంద్రశేఖర్, తిరుపతి, కిశోర్‌గౌడ్, శ్రీనివాస్, ప్రదీప్, రాజు, అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.