‘సర్’పై అవగాహన కలిగి ఉండాలి
ABN , Publish Date - Jun 20 , 2026 | 11:34 PM
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ (సర్), ఎన్యూమరేషన్ ఫారం, బీఎల్‌వో యాప్‌లపై బూత్ స్థాయి అధికారులు, ఏజెంట్లు, సూపర్‌వై జర్లు పూర్తి అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ కె హరిత అన్నారు.
- కలెక్టర్ కె హరిత
కెరమెరి, జూన్ 20(ఆంధ్రజ్యోతి): ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ (సర్), ఎన్యూమరేషన్ ఫారం, బీఎల్‌వో యాప్‌లపై బూత్ స్థాయి అధికారులు, ఏజెంట్లు, సూపర్‌వై జర్లు పూర్తి అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ కె హరిత అన్నారు. కెరమెరి మండలం కేస్లాగూడ రైతు వేదికలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ 2026లో భాగంగా బూత్‌స్థాయి అధికారులు, బూత్ స్థాయి ఏజెంట్లు, సూపర్‌వైజర్లకు శనివారం ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు. బూత్‌స్థాయి అధికారులు, ఏజెంట్లు, సూపర్‌వైజర్లు ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ ఎన్యూమరేషన్ ఫారం, బీఎల్‌వో యాప్‌లపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. బీఎల్‌ఓలు తమ పరిధిలోని ఇంటికి వెళ్లి ఎన్యుమరేషన్ ఫఫారంలో అవసరమైన వివరాలు నమోదు చేసే క్రమంలో వాలంటీర్ల సహకారం తీసుకోవాలని, బ్యాపింగ్ అయిన వారి వివరాలు, బ్యాపింగ్ కాని వారి వివరాలను ఎన్యుమరేషన్ ఫారంలో నమోదు చేయాలని తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరు జాబితాలో పేర్లు నమోదు కోసం ఫారం 6 ద్వారా చేసుకున్న దరఖాస్తులను తీసుకోవాలని తెలిపారు. బూత్ స్థాయి అధికారులు ఈ నెల 25వ తేదీ నుంచి జూలై 24 తేదీ వరకు ఎన్యుమరేషన్ ఫారంలో అవసరమైన పత్రాలతో తిరిగి తీసుకుని యాప్‌లో నమోదు చేయాలని తెలిపారు. ఎలాంఇ పొరపాట్లకు తావు లేకుండా ప్రక్రియను పారదర్శకంగా, ప్రశాంతంగా చేపట్టాలని తెలిపారు. ఈ సందర్భంగా బూత్ స్థాయి అధికారులకు కిట్లను అందజేశారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగ తనిఖీ చేశారు. వార్డులు, వైద్యులు, సిబ్బంది హాజరు పట్టిక, మందుల నిలువలు, పారిశుధ్య నివారణ అంశాలను పరశీలించారు. ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, వైద్యులు, సిబ్బంది విధుల పట్ల సమయపాలన పాటించాలని అన్నారు. విధులకు గైర్హాజరైన వైద్యులకు షోకాజ్ నోటీసు అందించాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌లు నాగార్జున, కవిత, బూత్ స్థాయి అధికారుల తదితరులు పాల్గొన్నారు.