Share News

కష్టపడ్డ వారికి నామినేటెడ్‌ పదవులు

ABN , Publish Date - Jun 20 , 2026 | 11:36 PM

ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం కష్ట పడి పని చేసే వారికి నామినేటెడ్‌ పదువులు దక్కుతాయని ఎమ్మెల్సీ దండె విఠల్‌ అన్నారు.

కష్టపడ్డ వారికి నామినేటెడ్‌ పదవులు
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ దండె విఠల్‌

- ఎమ్మెల్సీ దండె విఠల్‌

బెజ్జూరు, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం కష్ట పడి పని చేసే వారికి నామినేటెడ్‌ పదువులు దక్కుతాయని ఎమ్మెల్సీ దండె విఠల్‌ అన్నారు. శనివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సహకార సంఘం నామినేటెడ్‌ పదువులను త్వరలో ప్రభుత్వం భర్తీ చేస్తుందని అన్నారు. పార్టీ కోఎసం కష్ట పడి పని చేసే కార్యకర్తకు ఈ పదువులు దక్కుతాయని అన్నారు. ఎప్పుడు ప్రజల్లో ఉంటూ వారి కోసం పని చేసే కార్యకర్తలను గుర్తించి నామినేటెడ్‌ పదవి స్తామన్నారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అనంతరం ఎస్పీ పంక్షన్‌ హాల్‌లో వివాహన వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు జగ్గాగౌడ్‌, నాహిర్‌ అలీ, శ్రీవర్ధన్‌, పుష్పలత, సర్పంచ్‌లు రాంప్రసాద్‌, చిన్నయ్య, శ్రీహరి, చిరంజీవి, పెంటయ్య, రామకృష్ణ, పెంటయ్య, రాజన్న పాల్గొన్నారు.

Updated Date - Jun 20 , 2026 | 11:36 PM