Share News

జాతీయ సంఘాలు కార్మికులకు చేసిందేమీ లేదు

ABN , Publish Date - Jan 04 , 2026 | 11:30 PM

సింగ రేణి కార్మికులకు జాతీయ సంఘాలు ఏఐటీ యూసీ, ఐఎన్‌టీయూసీ చేసిందేమీ లేదని టీబీజీకేఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి అన్నారు.

జాతీయ సంఘాలు కార్మికులకు చేసిందేమీ లేదు
నినాదాలు చేస్తున్న టీబీజీకేఎస్‌ నాయకులు

టీబీజీకేఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి

శ్రీరాంపూర్‌, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): సింగ రేణి కార్మికులకు జాతీయ సంఘాలు ఏఐటీ యూసీ, ఐఎన్‌టీయూసీ చేసిందేమీ లేదని టీబీజీకేఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి అన్నారు. ఆర్‌కే న్యూటెక్‌ గనిలో యూని యన్‌ ముఖ్య కార్యకర్తల సమావేశం ఆదివారం నిర్వహించగా, ఆయనతో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి, ఏరియా ఉపాధ్యక్షుడు బండి రమేష్‌ హాజరై మాట్లాడా రు. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కార్మికులకు అనేక హక్కులు, సంక్షేమ పథకాలు కల్పించార ని, వాటిని ఇప్పుడు అమలు జరుగుతున్నా యన్నారు. కానీ జాతీయ సంఘాలు ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని, సింగరేణి డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం ఇష్టారీతిన వినియోగిస్తున్నా యని, రోజురోజుకు ప్రైవేటుపరం అవుతున్నా ఆయా సంఘాలకు చీమకుట్టినట్టు కూడా లేదని ఆరోపించారు. రానున్న రోజుల్లో టీబీజీకేఎస్‌ను గెలిపించి హక్కులు కాపాడుకుం దామని వారు సూచించారు. అనంతరం 30 మంది యూనియన్‌లో చేరారు. కార్యక్రమంలో నూనె కొమురయ్య, సతీష్‌, సత్తయ్య, రమేష్‌, అన్వేష్‌ రెడ్డి, ఎండీ లాల, వెంగళ కుమారస్వా మి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 04 , 2026 | 11:30 PM