Share News

‘పోష్‌’ చట్టంపై అవగాహన కలిగి ఉండాలి

ABN , Publish Date - Jan 07 , 2026 | 11:26 PM

ప్రివెన్షన్‌ ఆఫ్‌ సెక్సువల్‌ హెరాస్‌మెంట్‌ (పోష్‌)-2013 చట్టంపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ పేర్కొన్నారు.

‘పోష్‌’ చట్టంపై అవగాహన కలిగి ఉండాలి
పోస్టర్లను విడుదల చేస్తున్న కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌, అధికారులు

కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

మంచిర్యాల కలెక్టరేట్‌, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): ప్రివెన్షన్‌ ఆఫ్‌ సెక్సువల్‌ హెరాస్‌మెంట్‌ (పోష్‌)-2013 చట్టంపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్‌ జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో పోష్‌ చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధం, నివారణ, పరిష్కారాలను తెలుసుకోవాలని సూచించారు. మహిళల సంక్షేమం కోసం ఈ చట్టం తీసుకువచ్చారన్నారు. జిల్లాలో అంతర్గత ఫిర్యాదుల కమిటీలను ఏర్పాటు చేసి ప్రజలందరికి తెలిసే విధంగా విస్తృత ప్రచారం చేయాలని ఆదేశించారు. మహిళలకు తాము పనిచేసే ప్రదేశాల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఈ కమిటీలను సంప్రదించవచ్చని తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 47 అంతర్గత ఫిర్యాదుల కమిటీలు కొనసాగుతున్నాయని తెలిపారు. మహిళల సంక్షేమం కోసం హెల్ప్‌లైన్‌ టోల్‌ఫ్రీ నంబర్‌ 181 ఏర్పాటు చేయడం జరిగిందని దీనిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అనంతరం చట్టం సంబంధిత పోస్టర్లను విడుదల చేశారు. కార్యక్రమంలో డ్రైని డిప్యూటి కలెక్టర్‌ విలాయత్‌ ఆలీ, జిల్లా సంక్షేమాధికారి రౌఫ్‌ఖాన్‌, డీఎంహెచ్‌వో అనిత, జిల్లాపశువైద్యాధికారి శంకర్‌, అంతర్గత ఫిర్యాదుల కమిటీల ప్రతినిధులు కవిత, శివకిర్తీ తదితరులు పాల్గొన్నారు.

మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలి

మంచిర్యాల కలెక్టరేట్‌, జనవరి 7 (ఆంధ్ర జ్యోతి): మన్సిపల్‌ ఎన్నికల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రాణి కుముది ని పేర్కొన్నారు. బుధవారం హైద్రాబాద్‌ నుంచి వీడి యోకాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌, ఎన్నికల అధికా రులు, మున్సిపల్‌ కమిషనర్‌లతో సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఎన్నికల కమీషనర్‌ మాట్లాడుతూ మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణను ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా పార దర్శకంగా నిర్వహించాలన్నారు. ఎన్నికల అధికారుల కు విధుల కేటాయింపు, పోలింగ్‌, కౌంటింగ్‌ కేంద్రా లు, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు ఇతర ప్రతీ అంశంపై పర్యవేక్షించాలన్నారు. అర్హత గల ప్రతీఒక్కరు ఓటరు జాబితాలో ఉండేలా పర్యవేక్షిం చాలన్నారు. ఒకే కుటుంబానికి చెందిన అర్హత గల ఓటర్లు ఒకే పోలింగ్‌ కేంద్రం పరిధిలోకి వచ్చే విధం గా చూడాలన్నారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ మాట్లాడుతూ జిల్లాలోని 1 మున్సిప ల్‌ కార్పొరేషన్‌, నాలుగు మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహి స్తామన్నారు. ఈ క్రమంలో ముసాయిదా ఓటరు జాబితా ప్రకటించి అభ్యంతరాలు స్వీకరిస్తా మని, రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం చర్య లు తీసుకుంటామన్నారు. మున్సిపల్‌ ఎన్నికలు ప్ర శాంతంగా జరిగేలా అధికారుల సమన్వయంతో కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా అదన పు కలెక్టర్‌ చంద్రయ్య, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jan 07 , 2026 | 11:26 PM