క్యాంపుల్లోనే సభ్యులు
ABN , Publish Date - Feb 15 , 2026 | 11:56 PM
మున్సిపల్ ఎన్నికల్లో వివిధ పార్టీలు, గుర్తులపై పోటీ చేసిన గెలి చిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ప్రస్తుతం క్యాంపు బాట పట్టారు. ఈ నెల 13న ఫలితాలు విడుదలైన వెంటనే అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ తమ సభ్యు లను హుటాహుటిన వివిధ ప్రాంతాలకు క్యాంపు కోసం తరలించాయి.
- అన్ని పార్టీలదీ అదే తీరు
- నేడు మేయర్, మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక
- నేరుగా మునిసిపల్ కార్యాలయాలకు రానున్న కార్పొరేటర్లు, కౌన్సిలర్లు
- సభ్యులను కాపాడుకునేందుకు పార్టీల తిప్పలు
- బెల్లంపల్లిలో వీడని ఉత్కంఠ
మంచిర్యాల, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్ ఎన్నికల్లో వివిధ పార్టీలు, గుర్తులపై పోటీ చేసిన గెలి చిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ప్రస్తుతం క్యాంపు బాట పట్టారు. ఈ నెల 13న ఫలితాలు విడుదలైన వెంటనే అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ తమ సభ్యు లను హుటాహుటిన వివిధ ప్రాంతాలకు క్యాంపు కోసం తరలించాయి. మంచిర్యాల కార్పొరేషన్‌తో పాటు లక్షెటి ్టపేట మునిసిపాలిటీకి చెందిన కాంగ్రెస్ సభ్యులు స్థానిక ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు సూచన మేరకు ఆ పార్టీ బా ధ్యులు క్యాంపుకోసం మహారాష్ట్రంలోని షిరిడీకి వెళ్లగా, బెల్లంపల్లి, చెన్నూరు, క్యాతన్‌పల్లి సభ్యులను హైద్రా బాద్‌కు తరలించారు. క్యాతన్‌పల్లి మునిసిపాలిటీలో విజయం సాధించిన బీఆర్‌ఎస్, దాని మిత్రపక్షమైన సీపీఐ సభ్యులను బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ నేతృత్వంలో హైదరాబాద్‌కు తరలించారు.
ఎన్నికల్లో గెలుపొందిన సభ్యులు చివరి నిమిషంలో పార్టీలు మారే అవకాశం ఉండటంతో వారందరినీ క్యాం పుల పేరుతో దూర ప్రాంతాలకు తరలించి కాపాడుకొనే ప్రయత్నం చేస్తున్నారు. క్యాంపులో ఉన్న పలువురు సభ్యుల ఫోన్లను సైతం స్వాధీనం చేసుకున్నారంటే ఆయాపార్టీల నాయకులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటు న్నారో ప్రత్యేక చెప్పవలసిన అవసరం లేదు.
నేడు నేరుగా కార్యాలయాలకు రాక...
సోమవారం జిల్లాలోని మంచిర్యాల కార్పొరేషన్‌తో పాటు బెల్లంపల్లి, చెన్నూరు, క్యాతన్‌పల్లి, లక్షెట్టిపేట మునిసిపాలిటీల్లో మేయర్/చైర్మన్ ఎన్నిక నిర్వహించను న్నారు. దీంతో క్యాంపు బాటలో ఉన్న సభ్యులంతా ఆయా ప్రాంతాల నుంచి నేరుగా మునిసిపల్ కార్యాల యాలకు రానున్నారు. ప్రత్యేక బస్సుల్లో తిరిగి రానున్న సభ్యులు వివిధ మునిసిపల్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసే మేయర్/చైర్మన్‌తోపాటు డిప్యూటీ మేయర్/ వైస్ చైర్మన్ల ఎన్నికల్లో పాల్గొననున్నారు. ఎన్నిక అనంతరం కొత్త సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండటంతో ఆ ప్రక్రియ పూర్తయ్యే వరకు కార్యాలయాల నుంచి బయటకు వెళ్లకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.
మేయర్ పీఠం కాంగ్రెస్‌దే...
మంచిర్యాల కార్పొరేషన్‌లో మేయర్ పీఠం కైవసం చేసుకునేందుకు అవసరమైతే పొత్తు కుదుర్చుకోవాలన్న ఆలోచనతో ఉన్న బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీల ప్రయత్నాలు బెడిసికొట్టాయి. కాంగ్రెస్‌కు మేయర్ పదవి దక్కకుండా చేయాలనే లక్ష్యంతో రెండు ప్రతిపక్ష పార్టీలు అంతర్గత అవగాహనకు వచ్చాయి. రెండు పార్టీలకు వచ్చిన సీట్లతో మ్యాజిక్ ఫిగర్‌ను సొంతం చేసుకోవడం ద్వారా ఆయా పార్టీల నుంచి ఒకరికి మేయర్, మరొకరికి డిప్యూటీ మేయర్ పదవి చేజిక్కించుకోవాలనే నిర్ణయా నికి వచ్చాయి. అయితే ఊహించని విధంగా ఫలితాల్లో ఆ రెండు పార్టీలు సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యా యి. దీంతో సొంతంగా మేయర్, డిప్యూటీ మేయర్ పద వులు చేపట్టే అవకాశం కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. ఇది లా ఉండగా బీఆర్‌ఎస్‌కు చెందిన నాలుగురు కార్పొరేట ర్లు ఆదివారం స్థానిక ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్ రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్‌లో చేరిన వారిలో 23వడివిజన్ కార్పొరేటర్ కర్రు శంకర్, 28వ డివిజన్ కార్పొరేటర్ అమృత్ రాజ్‌కుమార్, 45వ డివిజన్ కార్పొరేటర్ దోమల సునీత, 47వ డివిజన్ కార్పొరేటర్ సాయికృష్ణతోపాటు 26వ డివిజన్ ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ కార్పొరేటర్ ఎరగదిండ్ల రవి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కొత్తగా పార్టీలో చేరిన ఐదుగురు సభ్యులతో కాంగ్రెస్ కార్పొరేటర్ల సంఖ్య ప్రస్తుతం 49కి చేరింది. బీఆర్‌ఎస్ టికెట్‌పై పోటీ చేసిన వారిలో ఎనిమిది మంది కార్పొరేటర్లుగా విజయం సాధించగా, వారిలో నలుగురు కాంగ్రెస్‌లో చేరారు. ఇదిలా ఉండగా బీజేపీకి ప్రస్తుతం ఐదుగురు మంది కార్పొరేటర్లు ఉన్నారు. వారిలోనూ కొందరు కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా లక్షెట్టిపేట, చెన్నూరు మునిసిపాలిటీల్లోనూ కాంగ్రెస్‌కు సరిపడా సభ్యుల సంఖ్య సొంతంగా ఉన్నందున చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను కాంగ్రెస్ సభ్యులే అలంకరించనున్నారు. క్యాతన్‌పల్లి మునిసిపాలిటీలో మాత్రం ప్రస్తుతం బీఆర్‌ఎస్‌కే అధికారం చేపట్టే అవకాశం ఉండగా, అనూహ్య సంఘటనలు చోటు చేసుకుంటే తప్పా....పీఠం కారు పార్టీకే దక్కనుంది. ్యతన్‌పల్లి మునిసిపాలిటీ 7వ వార్డుకు చెందిన స్వతంత్ర కౌన్సిలర్ గుర్రం శ్రీనివాస్ రాష్ట్ర మంత్రి గడ్డం వివేకానంద సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
బెల్లంపల్లిలో వీడని ఉత్కంఠ....
బెల్లంపల్లి మునిసిపాలిటీలో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. చైర్మన్ పీఠం ఏ పార్టీ అధిరోహిస్తుందో తెలియని పరిస్థితుల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 34 డివిజన్లుగల బెల్లంపల్లి మునిసిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లకు చెరి 14 సీట్లు రాగా, బీజేపీ 1, ఇండిపెండెంట్ అభ్యర్థులు ఐదు స్థానాల్లో గెలుపొందారు. కాంగ్రెస్ టికెట్‌పై గెలుపొందిన 26వ వార్డు కౌన్సిలర్ కుమారస్వామి, స్వతంత్ర కౌన్సిలర్ 30వ వార్డుకు చెందిన శంకర్ సింగ్‌లు శనివారం బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఈ నెల 14న ఆ పార్టీలో చేరారు. అయితే వేగంగా మారుతున్న సమీకరణాలను పరిశీలిస్తే పార్టీ మారిన వారు మనసు మార్చుకొని కాంగ్రెస్‌లో చేరేందుకు సన్నద్ధం అవుతున్న ట్లు సమాచారం. కాంగ్రెస్ సీటుపై గెలిచినందున ఒకవేళ ఆ పార్టీ విప్ జారీ చేస్తే సభ్యత్వం రద్దయ్యే ప్రమాదం ఉన్నందున బీఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్ సభ్యుడు తిరిగి కాంగ్రెస్‌కే మద్దతిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయనబాట లోనే స్వతంత్ర అభ్యర్థి కూడా నడుస్తారని ప్రచారం జరుగుతోంది. ఇక బీజేపీకి చెందిన ఏకైక కౌన్సిలర్ కూడా కేటీఆర్‌ను కలిసిన వారిలో ఉన్నారు. ఆయ న కూడా కాంగ్రెస్ సభ్యులతోపాటే అదే పార్టీకి మద్దతు ఇస్తాన ని చెప్పినట్లు సమాచారం. ఇదే జరిగితే కాంగ్రెస్ సభ్యుల సంఖ్య 17కు చేరనుంది. మరోవైపు మునిసిపాలిటీలో గెలిచిన మరో నలుగురు స్వతంత్ర కౌన్సిలర్లు కూడా ప్రస్తుతం కాంగ్రెస్ క్యాంపు లోనే ఉన్నారు. వారు కూడా మద్దతిస్తే అధికారపార్టీ సభ్యుల సంఖ్య 21కి చేరుతుంది. దీంతో సొంతంగానే కాంగ్రెస్ పార్టీ చైర్మ న్, వైస్‌చైర్మన్ పదవులను అలంకరించే అవకాశాలు ఉన్నాయి.
క్యాతనపల్లి చైర్మన్ కోసం కాంగ్రెస్ విశ్వప్రయత్నాలు
మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి బీఆర్‌ఎస్, సీపీఐ కౌన్సిలర్లు ఉన్న క్యాంపుపై కాంగ్రెస్ నాయకులు దాడి చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. భద్రాచలంలోని నందిని హోటల్లో క్యాంపులో ఉన్న కౌన్సిలర్లను చెదరగొట్టేందుకు పోలీసులు హోటల్‌పై దాడి చేశారు. ముందుగానే సమాచారం అందుకొని అప్రమత్తమైన చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కౌన్సిలర్లను పోలీసులు తనిఖీలు చేయకముందే అక్కడి నుంచి తరలించారు. భద్రాచలం నుంచి కౌన్సిలర్లను క్యాతనపల్లికి తరలించే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు కాకుండా భద్రాచలం, మంగపేట, ములుగు, ఏటూరునాగారం, కాటారం, చెన్నూరు బీఆర్‌ఎస్ శ్రేణులకు సమాచారం అందించి దారిపొడవునా ఉండేలా ప్రణాళికలు రూపొందించుకున్నారు. కౌన్సిలర్లందరినీ చెన్నూరు నియోజకవర్గం లోని క్యాతనపల్లిలోని తన నివాసానికి తరలించారు. నియోజక వర్గంలోని బీఆర్‌ఎస్ నేతలు పెద్దఎత్తున బాల్క సుమన్ ఇంటి వద్ద మోహరించారు. సోమవారం జరిగే చైర్మన్ ఎన్నికలో ఎలాం టి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రజ లు తమకు పూర్తి మెజారిటీ అందించినా అధికార పార్టీ దొడ్డిదా రిన చైర్మన్ పదవిని చేపట్టేందుకు ప్రయత్నించడం సిగ్గుచేటని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ విమర్శించారు.