Share News

వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలి

ABN , Publish Date - Sep 11 , 2026 | 11:50 PM

వైద్యులు, సిబ్బంది సమయ పాలన పాటిస్తూ ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని డీఎంహెచవో నరేందర్‌ రాథోడ్‌ అన్నారు.

వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలి
తాండూర్‌లో వైద్య చికిత్సలను పరిశీలిస్తున్న డీఎంహెచవో నరేందర్‌రాథోడ్‌

డీఎంహెచవో నరేందర్‌ రాథోడ్‌

తాండూర్‌, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): వైద్యులు, సిబ్బంది సమయ పాలన పాటిస్తూ ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని డీఎంహెచవో నరేందర్‌ రాథోడ్‌ అన్నారు. శుక్రవారం తాండూర్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ఆరోగ్య కేంద్రంలోని మందుల నిల్వలను, రికార్డులను, రిజిష్టర్‌లను తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వైద్యసేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ ఎక్స్‌పైరీకి దగ్గరగా ఉన్న మందులను ముందుగానే వాడాలని సూచించారు. తెలంగాణ డయాగ్నోస్టిక్స్‌కు పంపించే నమూనా వివరాలను రోజువారీగా నమోదు చేయాలన్నారు. వ్యాక్సినేషన నిల్వలను మరియు కోల్డ్‌ చైన సిస్టం సక్రమంగా ఉంచాలని ఆదేశించారు. వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున అన్ని గ్రామాల్లో వైద్య శిబిరాలను నిర్వహించాలన్నారు. పంచాయతీ, మున్సిపల్‌ సిబ్బంది సహకారంతో వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాల న్నారు. ఆయన వెంట సిబ్బంది ప్రసన్న, జయమని, రాంబాయి ఉన్నారు.

Updated Date - Sep 11 , 2026 | 11:50 PM