Share News

Mancheriala: చిన్నారులు, గర్భిణులకు పౌష్టికాహారం అందించాలి

ABN , Publish Date - Apr 25 , 2026 | 11:50 PM

మంచిర్యాల కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): చిన్నారులు, గర్భిణుల ఆరోగ్యం కోసం పౌష్టికాహారం అందించాలని కలెక్టర్‌ కుమార్‌దీపక్‌ అన్నారు.

Mancheriala:  చిన్నారులు, గర్భిణులకు పౌష్టికాహారం అందించాలి

మంచిర్యాల కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): చిన్నారులు, గర్భిణుల ఆరోగ్యం కోసం పౌష్టికాహారం అందించాలని కలెక్టర్‌ కుమార్‌దీపక్‌ అన్నారు. శని వారం కలెక్టరేట్‌లో మహిళాశిశు సంక్షేమశాఖ ఆధ్వర్యం లో నిర్వహించిన పోషణ్‌ పక్వాడా 8వవిడత కార్యక్ర మానికి ఆయన హాజరై మాట్లాడారు. పిల్లల్లో మొదటి 6సంవత్సరాలలో మెదడు అభివృద్ధి గరిష్టంగా ఉంటుం దని, ఈవిషయం ప్రధానఅంశంగా పరిగణలోకి తీసు కుని ప్రత్యేకదృష్టి సారించాలన్నారు. గర్భిణులు, పిల్లల కు పౌష్టికాహారం అందించడం ద్వారా ఆరోగ్యకరమైన భవిష్యత్‌ను నిర్మించవచ్చన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ఆటల ఆధారిత విద్యను ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. అనంతరంగర్భిణులకు శ్రీమంతం, పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడంతోపాటు గ్రాడ్యు యేషన్‌ ధ్రువపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమఅధికారి రౌఫ్‌ఖాన్‌, డీఎంహెచ్‌వో అనిత, అంగన్‌వాడీ సిబ్బంది పాల్గొన్నారు.

మ్యాపింగ్‌ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలి

ప్రత్యేకసమగ్ర ఓటర్ల జాబితా సవరణలో మ్యాపింగ్‌ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో తహసీల్దార్‌ లు, ఎన్నికల అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన 2002ఓటర్ల జాబితాలు ఓటర్‌ సర్వీస్‌ పోర్టల్‌లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు, జిల్లా, మండలస్ధాయి అధి కారులు తమ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులు వారి కుటుంబసభ్యులు తాము నమోదు చేయబడిన పోలింగ్‌కేంద్రాలకు సంబంధించిన బూత్‌ స్థాయి అధికారులను సంప్రదించి 2002ఓటర్ల జాబి తాలో ఎన్నికల మ్యాపింగ్‌ ప్రక్రియను పూర్తి చేసేం దుకు తగినచర్యలు తీసుకోవాలన్నారు. ఫారం6,7,8 ద్వారా అందిన దరఖాస్తులను పరిశీలించి చర్యలు తీసు కోవాలన్నారు. అధికారులు సమన్వయంతో కార్యక్ర మాన్ని విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపుకలెక్టర్‌ రాములు, ఆర్డీవో శ్రీనివాసరావు, ప్రత్యేక ఉపపాలన అధికారి చంద్రకళతదితరులు పాల్గొన్నారు.

పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం

మందమర్రిటౌన్‌ : పరిసరాల పరిశుభ్రతతోనే ప్రజారోగ్యం సాధ్యమని నివాసాల్లో ఎలాంటి నీరును కూడా నిల్వ ఉంచుకోవద్దని కలెక్టర్‌ కుమార్‌దీపక్‌ పేర్కొన్నారు. శనివారం ప్రపంచ మలేరియా దినో త్సవం సందర్భంగా పట్టణంలోని 23వ వార్డు ఊరు మందమర్రిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. మురుగు కాలువ లతోపాటు ఇంటి పరిసరాల్లో నెలల తరబడి మురికి నీరుఉంటే దోమలు వృద్ధి చెందుతాయన్నారు. రోజు నివాసాల్లో వాడే కూలర్లలో కూడా కీటకాలు వృద్ధి చెందే అవకాశాలు ఉంటాయని తెలిపారు. వాటిని ప్రతిరోజు శుభ్రం చేసుకోవడం మంచిదన్నారు. లేక పోతే వాటి నుంచి కూడా వ్యాధులు సోకే అవకాశం ఉంటాయని చెప్పారు. ప్రజారోగ్యా నికి సంబంధించి వ్యాధులు సోకకుండా వర్షాకాలం ముందే అందరితో ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తా మని తెలిపారు. మలేరియా రహిత సమాజమే లక్ష్య మని పేర్కొన్నారు. జిల్లా వైద్యఆరోగ్యశాక అధికారి డాక్టర్‌ ఎస్‌ అనిత మాట్లాడుతూ వర్షాకాలం ఆరంభం కానున్న దృష్ట్యా కొబ్బరిబోండాలు, పాతటైర్లు ఉండనీ యవద్దని అన్నారు. ప్రజల ఆరోగ్యానికి దోమలే ప్రధాన శత్రువులనే విషయాన్ని గ్రహించాలన్నారు. ప్రజల ఆరో గ్యానికి సంబంధించి కలెక్టర్‌ నేతృత్వంలో ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమం చేస్తున్నామని ఆమె తెలిపారు. అనంతరం ప్రతిజ్ఞ చేశారు. ఆరోగ్య కార్యకర్తలు ఉచిత రక్తపరీక్షలు చేపట్టి అందరినీ అప్రమత్తం చేస్తారని తెలిపారు. ఎండలు తీవ్రంగా ఉన్న దృష్ట్యా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఉదయం పూటనే పనులు ముగించుకోవాలన్నారు. తప్పనిసరిగా పెద్ద మొత్తంలో నీరు తాగాలని తెలిపారు. అనంతరం ఆయన వార్డుల్లో తిరుగుతూ రక్షితనీటి పథకాలను, మురుగుకాలువలను పరిశీలించారు. కార్యక్రమంలో ప్రతిజ్ఞ, మలేరియా ర్యాలీని నిర్వహించారు. అంతకుముందు మలేరియా వ్యాధిని కనుగొన్న డాక్టర్‌ రొనాల్డ్‌రాస్‌ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు ఆర్పించారు. మంద మర్రి పట్టణంలో ప్రజలకు ఉత్తమవైద్యం చేస్తున్న వారికి ప్రశంసాపత్రాలు అందేశారు. ఈ ర్యాలీని కలెక్టర్‌తోపాటు జిల్లా వైద్యాఆరోగ్య అధికారి అనిత నిర్వహించారు. కార్యక్రమంలో డాక్టర్‌ సుధాకర్‌ నాయక్‌, డాక్టర్‌ ప్రసాద్‌, జిల్లా మాస్‌ మీడియా అధికారి దుస్స ప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 25 , 2026 | 11:51 PM