Mancherial: ఘనంగా ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం
ABN , Publish Date - Aug 19 , 2026 | 11:47 PM
ప్రొఫెషనల్ ఫొటో, వీడియోగ్రాఫర్ల సంక్షేమ సంఘం జిల్లాశాఖ ఆధ్వర్యంలో బుధవారం ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని నాయకులు జిల్లా కేంద్రంలో, మండలాల్లో ఘనంగా జరుపుకున్నారు.
మంచిర్యాల క్రైం/కలెక్టరేట్/దండేపల్లి/బెల్లంపల్లి/తాండూర్/నెన్నెల/చెన్నూరు/భీమారం/జన్నారం, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): ప్రొఫెషనల్ ఫొటో, వీడియోగ్రాఫర్ల సంక్షేమ సంఘం జిల్లాశాఖ ఆధ్వర్యంలో బుధవారం ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని నాయకులు జిల్లా కేంద్రంలో, మండలాల్లో ఘనంగా జరుపుకున్నారు. ఈసందర్భంగా కెమెరా సృష్టికర్త లూయిస్ డాగురె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళ్లు అర్పించారు. ఫొటోగ్రఫీ పతాకాన్ని ఆవిష్కరించి కేక్‌కట్ చేశారు. సంఘం జిల్లా అధ్యక్షుడు అప్పాసు రాము మాట్లాడుతూ వేయి మాటలు చెప్పలేని భావం ఒక్క ఫొటో చెబుతుందన్నారు. మంచిర్యాల జిల్లా ఫొటో, వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ జిల్లా ప్రధానకార్యదర్శి పోతరవేని తిరుపతి అవయవదానానికి ముందకు వచ్చారు. బెల్లంపల్లి పట్టణంలో ఫొటోఅండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ నాయకులు తిలక్ స్టేడియం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. తాండూర్ ఐబీలో సీనియర్ ఫొటోగ్రాఫర్ సాలిగాం బానయ్యను ఘనంగా సన్మానించారు. నెన్నెలలో ఫొటోగ్రాఫర్లు ప్రాథమిక పాఠశాలలో మొక్కలు నాటారు. జన్నారం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.