Share News

Mancherial: గూడెంగుట్టను మరో అన్నవరంగా తీర్చిదిద్దుతాం

ABN , Publish Date - Oct 21 , 2026 | 11:52 PM

దండేపల్లి, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లా లోని ప్రముఖ్య పుణ్యక్షేత్రమైన మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెంగుట్ట శ్రీసత్య నారాయణస్వామి ఆలయాన్ని దేశంలో నంబర్‌వన్‌ పుణక్షే త్రంగా, మరోఅన్నవరంగా తీర్చిదిద్దుతామని మంచిర్యాల ఎమ్మెల్యే కోక్కిరాల ప్రేమ్‌సాగ ర్‌రావు స్పష్టంచేశారు.

Mancherial:   గూడెంగుట్టను మరో అన్నవరంగా తీర్చిదిద్దుతాం

రూ.200కోట్లతో ఆలయ పునర్నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ

గోదావరి పుష్కరాల నాటికి పూర్తిస్థాయిలో సౌకర్యాలు

దండేపల్లి, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లా లోని ప్రముఖ్య పుణ్యక్షేత్రమైన మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెంగుట్ట శ్రీసత్య నారాయణస్వామి ఆలయాన్ని దేశంలో నంబర్‌వన్‌ పుణక్షే త్రంగా, మరోఅన్నవరంగా తీర్చిదిద్దుతామని మంచిర్యాల ఎమ్మెల్యే కోక్కిరాల ప్రేమ్‌సాగ ర్‌రావు స్పష్టంచేశారు. విజయ దశమి పర్వదినాన్ని పురస్క రించుకొని మంగళవారం గూడెంగుట్ట శ్రీసత్యనారాయణ స్వామిఆలయ పునర్నిర్మాణ పనులకు ఆయన కుటుంబసమేతంగా హాజరై శాస్త్రోక్తంగా భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ భక్తుల కొంగుబంగారమైన గూడెంక్షేత్రాన్ని సమగ్ర ప్రణాళికతో సుమారు రూ.200కోట్లతో సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రభుత్వంనుంచి రూ.70కోట్లనిధులు మంజూర య్యా యని వెల్లడించారు. వచ్చేఏడాది జరగనున్న గోదావరి పుష్కరాల నాటికి లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాల కలగకుండాఅన్ని రకాలవసతు లు కల్పిస్తున్నామన్నారు. పుష్కరఘాట్లు. విశాంత్రి గదుల, క్యూలైన్లు,రవాణా సదుపాయాలను అత్యున్నత ప్రమాణాలతో నిర్మిస్తామన్నారు. నిర్మాణ పనుల్లో నాణ్యతలోపిస్తే ఉషేక్షించేది లేదన్నారు. అధికారులు, సంబంధిత కాంట్రాక్టర్లు సమ న్వయంతో పనులను నిర్ణేశిత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. అడగ్గానే ఆలయఅభివృద్ధికి భారీగా నిధులు మంజూ రు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు నియోజకవర్గ ప్రజలతరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈసందర్భంగా ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. ఆలయ పునర్‌నిర్మాణ భూమిపూజలో డీసీసీ మాజీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, ఎమ్మెల్యేతనయుడు కొక్కిరాల చరణ్‌రావుడీసీపీ భాస్కర్‌, మంచిర్యాల మున్సిపల్‌ మేయర్‌ ధర్నిమధుకర్‌, ఆలయఈవో శ్రీని వాస్‌, మార్కెట్‌కమిటీ చైర్మన్లు వెంకటేశ్వర్లు, బానేష్‌, సొసైటీ చైర్మన్‌ శ్రీనివాస్‌,నాగభూషణం, ఛాంబర్‌ఆఫ్‌ కామర్స్‌చైర్మన్‌ గుండసుధాకర్‌, ఆర్‌జీపీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడుగడ్డం త్రిమూర్తి, మండ లప్రజాప్రతినిధులు, పార్టీనేతలు, ఆలయధర్మకర్తలు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Oct 21 , 2026 | 11:52 PM