Share News

Mancherial: విద్యతోనే ఉన్నతస్థాయికి ఎదుగుతాం

ABN , Publish Date - Nov 11 , 2026 | 11:26 PM

లక్షెట్టిపేట, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): విద్యతోనే జీవితంలో ఉన్నతస్థాయికి ఎదుగుతామని కలెక్టర్‌ కుమార్‌దీపక్‌ అన్నారు.

Mancherial:   విద్యతోనే ఉన్నతస్థాయికి ఎదుగుతాం
లక్షెట్టిపేట ఎంజేపీలో జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడలను ప్రారంభిస్తున్న జిల్లాకలెక్టర్‌

కలెక్టర్‌ కుమార్‌దీపక్‌

లక్షెట్టిపేట, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): విద్యతోనే జీవితంలో ఉన్నతస్థాయికి ఎదుగుతామని కలెక్టర్‌ కుమార్‌దీపక్‌ అన్నారు. లక్షెట్టిపేట పట్టణంలోని మహాత్మ జ్యోతిబాఫూలే పాఠశాలలో బుధవారం ఏర్పాటు చేసిన ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా వార్షిక క్రీడాదినోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొ న్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ విద్యా ర్థులు చదువుతోపాటు క్రీడల్లో కూడా రాణించాల న్నారు. ప్రభుత్వం విద్యార్థులకు పాఠశాలల్లో అదే విధంగా వసతిగృహాల్లో మంచిమౌళిక సదుపాయా లతోపాటు విద్యాభోధన, నాణ్యమైన ఆహారం అందిం స్తోందన్నారు. జిల్లాలో మరోమూడు యంగ్‌ ఇండియా రెసిడెన్సియల్‌ పాఠశాలలనిర్మాణం కూడా చేపడుతోం దన్నారు. ఒక్కోపాఠశాల సుమారు 2700మంది ఉండేందుకు వీలుగా ఉంటుందని తెలిపారు. ప్రతీ విద్యార్థి పట్టుదల క్రమశిక్షణతో చదవాలని ఒక మంచి లక్ష్యం ఎంచుకుని దాని సాధన కోసం కృషి చేయాలని సూచించారు. అనంతరం జ్యోతిప్రజ్వలన చేసి క్రీడా పతాకాన్ని ఆవిష్కరించి వార్షిక క్రీడలను ప్రారంభించారు. కార్యక్రమంలో ఆర్సీవో శ్రీధర్‌, పాఠశాల ప్రిన్సిపాల్‌ మంగతో పాటు క్రీడాకారులు, పీడీలు, పీఈటీలు, సిబ్బంది పాల్గొన్నారు.

ఫ తహసీల్దార్‌

కార్యాలయం

సందర్శించిన కలెక్టర్‌..

లక్షెట్టిపేట తహసీల్దార్‌ కార్యాలయంను కలెక్టర్‌ కుమార్‌దీపక్‌ బుధవారం సందర్శించారు. భూభారతి, భూముల రీసర్వే, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథ కాలకు సంబంధించిన అంశాలను డిప్యూటీ తహసీ ల్దార్‌ శ్రావణితో చర్చించారు. అంతేకాకుండా జీవో నంబర్‌, 58,59 దరఖాస్తుల స్థితిగతులను క్షేత్రస్థాయి లో పరిశీలించారు. అర్హతకలిగిన లబ్ధిదారులకు నిబంధనల ప్రకారం ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని డిప్యూటీ తహసీల్దార్‌ను ఆదేశించారు. కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది ఉన్నారు.

Updated Date - Nov 11 , 2026 | 11:26 PM