Mancherial: చెన్నూరును పట్టి పీడిస్తున్న వైరల్ జ్వరాలు
ABN , Publish Date - Oct 15 , 2026 | 12:14 AM
చెన్నూరు, అక్టోబరు 14 (ఆంధ్ర జ్యోతి): చెన్నూరుపట్టణంతో పాటు మండలంలోని పలుగ్రామాలను వైరల్జ్వరాలు పట్టి పీడిస్తుండడం తో ప్రజలు ఆందోళన చెందుతున్నా రు.
-ఆందోళన చెందుతున్న ప్రజలు
చెన్నూరు, అక్టోబరు 14 (ఆంధ్ర జ్యోతి): చెన్నూరుపట్టణంతో పాటు మండలంలోని పలుగ్రామాలను వైరల్జ్వరాలు పట్టి పీడిస్తుండడం తో ప్రజలు ఆందోళన చెందుతున్నా రు. రోజురోజుకు వాతావరణంలో ఏర్పడుతున్న మార్పులు, పారి శుధ్యం లోపించి ఈగలు, దోమలు వ్యాప్తిచెంది ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. రోజుకు వందల సంఖ్యలో చెన్నూరు సామాజిక ఆరోగ్యకేంద్రానికి జ్వరపీడితులు వస్తుండడంతో ఆసుపత్రి ఆవరణ రోగులతో కిక్కిరిసిపోతున్నది. గడిచిన 14రోజుల్లో దాదాపు 4వేల మంది ఓపీ నమోదు చేయించుకున్నారు. కాగా 600మంది ఆసుపత్రిలో అడ్మిట్ అయి డిశ్చార్జ్ అయ్యారు. ఈనెల1న 362, 2న 324 మంది, 3న 294 మంది, 4న 153 మంది, 5న 411, 6న 326, 7న 296, 8న 336, 9న 307 , 10న 242, 11న 103, 12న 388, 13న 280 మంది ఓపీనమోదు కాగా బుధవారం 320మంది ఓపీ నమోదు చేయించారు. గడిచిన 14 రోజుల్లో 4146మంది ఓపీనమోదు చేయించుకోగా 620 మంది చికిత్సలు పొందారు. రోజుకు వందల సంఖ్యలో జ్వరపీడితులు తరలివస్తుండడంతో ఆసుపత్రిలో ఉన్న 50బెడ్లు సరిపోక రోగులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఆసుపత్రిలో బెడ్లు సరికపోకపోవడంతో ప్రైవేటు ఆసుపత్రితోపాటు మంచిర్యాలలోని ఆసుపత్రులకు వెళ్తున్నారు. వైద్యశాఖ స్పందించి వైద్యశిబిరాలను నిర్వహించి జ్వరాలను అరికట్టాల్సిన అవసరం ఉంది.
ఫ ప్రతి ఒక్కరికి వైద్యం అందిస్తాం
- సత్యనారాయణ, ఆసుపత్రి సూపరింటెండెంట్
జ్వరంతో బాధపడుతూ సామా జిక ఆరోగ్యకేంద్రానికి వస్తున్న జ్వర పీడితులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నాం. రోజుకు దాదాపు ఆసుపత్రిలో 300మంది ఓపీ నమో దు అవుతున్నది. ఇందులో ఎక్కువగా వైరల్ జ్వరబాధితులు ఉన్నారు.