Share News

Mancherial: ఘనంగా విజయదశమి వేడుకలు

ABN , Publish Date - Oct 21 , 2026 | 11:49 PM

మంచిర్యాలక్రైం, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): మంచి ర్యాల నియోజకవర్గంలో విజయదశమి వేడుకలు మంగళ వారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు, సురేఖ దంపతులు పూజలో పాల్గొన్నారు.

 Mancherial:  ఘనంగా విజయదశమి వేడుకలు

మంచిర్యాలక్రైం, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): మంచి ర్యాల నియోజకవర్గంలో విజయదశమి వేడుకలు మంగళ వారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు, సురేఖ దంపతులు పూజలో పాల్గొన్నారు. విశ్వనాథ ఆల యంలో అమ్మవారికి పూజలుచేసి రథాన్ని ప్రారంభించారు. గౌతమేశ్వర ఆలయం ప్రాంగణంలో జమ్మిచెట్టు వద్ద శమీపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే తనయుడు చరణ్‌రావు, మేయర్‌ ధర్ని మధుకర్‌, కార్పొరేటర్‌ తూముల నరేష్‌, మార్కెట్‌కమిటీ చైర్మన్‌ బానేష్‌, ఐఎన్‌టీయూసీ అధ్యక్షుడు తిరుపతి, కార్పొరేటర్లు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

మంచిర్యాల కలెక్టరేట్‌ : మంచిర్యాల జిల్లా కేంద్రంలో మంగళవారం దసరా సంబరాలు అంబరాన్నంటాయి. ప్రజలు నూతనవస్ర్తాలు ధరించి ఆలయాలకు వెళ్లి పూజ లు చేశారు. ఇళ్లలో విందులు చేసుకున్నారు. విశ్వనాథ ఆల యం నుంచి ఉత్సవమూర్తులతో గోదావరిరోడ్డులోని గౌత మేశ్వరాలయం వరకు రథోత్సవం నిర్వహించారు. శ్రీదేవి భూదేవిసహిత వెంకటేశ్వర ఉత్సవవిగ్రహాలతో ఊరేగింపు నిర్వహిం చారు. జమ్మిచెట్టుకు వేదపండితులు పూజలు చేశారు. జమ్మి ఆకులు ఒకరికి ఒకరు ఇచ్చుకుని పండగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

చెన్నూరు : విజయానికి ప్రతీక విజయదశమి అని రాష్ట్ర కార్మికగనులశాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామి అన్నా రు. మంగళవారం దసరా పండగను పురస్కరించుకుని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన ఆయుధ, శమీపూజ కార్యక్రమాల్లో ఆయన సతీ సమేతంగా పాల్గొన్నారు. ఆయన మాట్లా డుతూ భారతీయ సంస్కృతి సంప్రదాయా లకు ప్రతిరూపం దసరా పండగ అన్నారు. అనంతరం ఆయుధ, శమీ పూజల్లో పాల్గొన్నారు. ఆయన, సతీమణి సరోజ పట్టణంలోని దుర్గామాత మండపాలను సందర్శించి పూజలను చేశారు. కార్యక్రమంలో మార్కెట్‌కమిటీ చైర్మన్‌ మహేష్‌ ప్రసాద్‌ తివారీ, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పెద్దింటి పద్మశ్రీనివాస్‌, వైస్‌చైర్మన్‌ వినయ్‌, మదన పోచమ్మ ఆలయ కమిటీచైర్మన్‌ సతీష్‌కుమార్‌, కౌన్సిలర్లు, నాయకులు ప్రజలు పాల్గొన్నారు.

చెన్నూరు పట్టణ, మండల ప్రజలు మంగళవారం దసరాపండగను ప్రజలు ఘనంగా జరుకున్నారు. దుర్గా మాత ఆలయంలో, మండపాల్లోని దుర్గామాతకు భక్తులు పూజలు చేశారు. గోదారమ్మ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన శమీ చెట్టు వద్ద ప్రత్యేక పూజలు చేసి ఒకరికి ఒకరు జమ్మి ఆకులు ఇచ్చుకుని పండగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పెద్దింటి పద్మ, వైస్‌చైర్మన్‌ వినయ్‌, కౌన్సిలర్లు, సర్పంచులు ,ఉపసర్పంచులు, ప్రజలు పాల్గొన్నారు.

దండేపల్లి: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించు కొని మండలంలో అన్ని గ్రామాల్లో మంగళవారం వేడు కలను ప్రజలందరు వైభవంగా జరుపుకున్నారు. జమ్మి చెట్టకు పూజలు నిర్వహించారు. ముందుగా ప్రజలు భక్తి గీతాలు, బ్యాండ్‌ మేళాలతో ఊరేగింపుగా జమ్మి చెట్టుకు పూజలు చేశారు. అనంతరం జమ్మి ఆకుతో ఒకరికొకరు దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇళ్లలో ప్రజలు వారివారి వాహనలకు పూజలు చేశారు. దసరా వేడుకల్లో అవాంఛనీయ సంఘటనలు జర గకుండా ఎస్సై గుండేటి రాజవర్ధన్‌ ఆఽధ్వర్యంలో ప్రతి గ్రామంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి పర్యవేక్షించారు.

నస్పూర్‌: పట్టణంలో విజయ దశమి పర్వదినాన్ని మంగళవారం ప్రజలు ఆనందోత్సవాల మధ్య ఘనంగా జరుపుకున్నారు. ఉదయం ఆలయాల వద్ద వాహనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రంవేళలో భక్తిశ్రద్ధలతో భాజా భజంత్రీలతో జమ్మి చెట్టు వద్ద పూజలు చేశారు. శమీ పూజా కార్యక్రమం అనంతరం జమ్మి ఆకుతో ఒక్కరికొ కరూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. దసరా ఉత్సవాల సందర్భంగా నస్పూర్‌ పోలీసులుబందోబస్తు నిర్వహించారు.

బెల్లంపల్లి : చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి అని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్‌, రాష్ట్ర కార్మికగనులశాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామి పేర్కొ న్నారు. మంగళవారం పట్టణంలోని తిలక్‌స్టేడియంలో హిందూ ఉత్సవసమితి ఆధ్వర్యంలో నిర్వహించిన రావణాసుర వధ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దుర్గాదేవి ఆశీస్సులతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన హిందూ ఉత్సవ సమితి నిర్వాహకులను అభినందిస్తున్నామని తెలిపారు. అనంతరం రావణాసుర వధ కార్యక్రమాన్ని ప్రారంభిం చారు. కార్యక్రమంలో మున్సిపల్‌చైర్‌పర్సన్‌ దావ స్వాతి రమేష్‌, వైస్‌చైర్మన్‌ రాగంశెట్టి సత్యనారాయణ, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రత్నం సుకుమారి, పట్టణాధ్య క్షుడు బండి ప్రభాకర్‌యాదవ్‌, కౌన్సిలర్లు, నాయకులు, హిందూ ఉత్సవ సమితి సభ్యులు ప్రజలు పాల్గొన్నారు.

వేమనపల్లి : మండలంలో మంగళవారం విజయదశమి పంగను ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. నూతన వస్ర్తాలు ధరించి ఉదయం ఆలయాలకు వెళ్లి పూజలు చేశారు. ఇళ్లలో పిండివంటలు చేసుకుని ఆరగించారు. వాహనాలకు పూజలు చేశారు. సాయంత్రం జమ్మిచెట్టుకు పూజలు చేసి ఒకరికిఒకరు పండగ శుభాకాంక్షలు తెలుపు కున్నారు.

కోటపల్లి : విజయదశమి వేడుకలు మంగ ళవారం మండలంలో, గ్రామాల్లో వైభవంగా జరిగాయి. దేవాలయాల్లో ప్రత్యేకపూజలు చేసిన ప్రజలు సాయంత్రం వేళ డప్పుచప్పుళ్లు, మంగళహారతులతో శమీవృక్షానికి పూజలు నిర్వహించారు. మండల కేంద్రంలో సర్పంచు ఆలూరి సంపత్‌ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. పెళ్లి పోచమ్మ దేవాలయం సమీపంలోని శమీ వృక్షానికి గ్రామస్థులతో ర్యాలీగా వెళ్లి పూజలు చేశారు. మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌లో చెన్నూరురూరల్‌ సీఐ కృష్ణ, ఎస్‌ఐ రాజశేఖర్‌ ఆధ్వర్యంలో పోలీసులు ఆయుధపూజ చేశారు. జమ్మి ఆకులను ఒకరికి ఒకరు ఇచ్చుకుని పండగ శుభాకాంక్షలు తెలిపారు.

భీమారం : మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో దసరా పండగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. కోదండరామాలయం ఆవరణలో సాయంత్రం జమ్మిచెట్టుకు పూజలు చేశారు. అనంతరం ఒకరికి ఒకరు జమ్మి ఆకులు ఇచ్చుకుని పండగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఆవడం క్రాస్‌ రోడ్డు వద్ద రావణసుర వధ కార్యక్రమాన్ని నిర్వహించగా ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మందమర్రిరూరల్‌ : మండలంలో దసరా పండగను మంగళవారం ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఇళ్లలో పిండివంటలు చేసుకున్నారు. ఆయా గ్రామాల్లో సర్పంచులు శమీ చెట్లకు పూజలు చేసి పండగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

Updated Date - Oct 21 , 2026 | 11:49 PM