Share News

Mancherial: క్షయ వ్యాధిని నియంత్రించవచ్చు

ABN , Publish Date - Sep 19 , 2026 | 12:07 AM

చెన్నూరు, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): పోషకాహారం తీసుకోవడం ద్వారా క్షయ వ్యాధిని నియంత్రించవచ్చని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి నరేందర్‌ రాథోడ్‌ అన్నారు.

 Mancherial:  క్షయ వ్యాధిని నియంత్రించవచ్చు

చెన్నూరు, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): పోషకాహారం తీసుకోవడం ద్వారా క్షయ వ్యాధిని నియంత్రించవచ్చని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి నరేందర్‌ రాథోడ్‌ అన్నారు. శుక్రవారం స్థాని కఅర్భన్‌ ప్రాథమికఆరోగ్య కేంద్రం లో 30మంది క్షయవ్యాధిగ్రస్తులకు పోషకాహారకిట్‌లను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి టీబీఅభియాన్‌ కార్యక్రమంలో భాగంగా క్షయ వ్యాధిగ్రస్తులను త్వరగా గుర్తించి సత్వరచికిత్స అందించాలన్నారు. జిల్లాలోని దాతల సహ కారంతో వ్యాధిగ్రస్తులకు పోషకాహార కిట్లను అందించాలని, నిక్షయ్‌ పోర్టల్‌లో వివరాలను నమోదు చేయాలన్నారు. 2030నాటికి క్షయ వ్యాధిని పూర్తిగా అంతం చేయడమే లక్ష్యంగా వైద్యఆరోగ్యశాఖ కృషిచేస్తుందన్నారు. క్షయ వ్యాధిగ్రస్తులు క్రమం తప్పకుండా మందులు తీసుకోవాలన్నారు. కౌన్సిలర్‌ శాంతారాణిచంద్ర కళ, జగదీష్‌, దాతలు క్షయవ్యాధిగ్రస్తులకు ఉచితంగా పోషకాహారకిట్‌లను పంపిణీచేశారు. కార్యక్రమంలో వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

సమయపాలన పాటించాలి

కోటపల్లి: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంతోపాటు సబ్‌సెంటర్లలో వైద్యసి బ్బంది సమయపాలన పాటించాలని జిల్లా వైద్యాధికారి నరేందర్‌రాథోడ్‌ అన్నారు. శుక్ర వారం మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీచేశారు. మందుల నిల్వల గదు లను, రికార్డులను పరిశీలించారు. వైద్యసిబ్బంది కి పలుసూచనలు చేశారు. కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్‌ రాజేష్‌, హెల్త్‌ ఎడ్యుకేటర్‌ అల్లాడిశ్రీనివాస్‌, సీహెచ్‌వోలు జగదీష్‌, నాందేవ్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Sep 19 , 2026 | 12:07 AM