Share News

Mancherial: వలస కుటుంబాల్లో విషాదం

ABN , Publish Date - Oct 26 , 2026 | 12:00 AM

జైపూర్‌, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): మంచిర్యాల జిల్లా జైపూర్‌ మండలం ఇందారం సమీపంలోని ఓ నీటికుంటలో పడి ముగ్గురు మృతిచెందడం వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.

 Mancherial: వలస కుటుంబాల్లో విషాదం
మృతదేహాల వద్ద రోదిస్తున్న కుటుంబీకులు

- కుంటలో పడి ముగ్గురి మృతి

జైపూర్‌, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): మంచిర్యాల జిల్లా జైపూర్‌ మండలం ఇందారం సమీపంలోని ఓ నీటికుంటలో పడి ముగ్గురు మృతిచెందడం వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా ఖమ్మం మండలంలోని మంగలగూడెం గ్రామానికి చెందిన కొన్ని కుటుంబాలు జైపూర్‌ మండలంలోని ఇందారంలోని కాసింపల్లెలో గుడారాలు వేసుకుని గ్యాస్‌స్టౌవ్‌లు రిపేర్‌ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాయి. వీరిలో మోటం మణియమ్మ(24), మోటం కీర్తన(16), మదేని కావ్య(9) ఆదివారం మధ్యాహ్నం బట్టలు ఉతికేందుకు సమీపంలోని కుంట వద్దకు వెళ్లారు. సాయంత్రమైనా వారు ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు కుంట వద్దకు వెళ్లి చూశారు. కుంట సమీపంలో చెప్పులు, బట్టలు చిందర వందరగా పడి ఉన్నాయి. దీంతో అనుమానం వచ్చి కుంటలోకి దిగి వెతికారు. ఈ క్రమంలో ముగ్గురి మృతదేహాలు కుంటలో లభించాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతిచెందిన మణియమ్మ, కీర్తన వదిన మరదళ్లు కాగా కావ్య మణియమ్మకు వరుసకు చెల్లెలు అవుతుంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సంఘటన స్థలాన్ని సీఐ నవీన్‌కుమార్‌, ఎస్‌ఐ భూమేష్‌ సందర్శించారు.

-ఆసుపత్రికి వెళ్లిన భర్త అంతలోనే విషాదం..

మృతిచెందిన మణియమ్మ భర్త మేసయ్య అనారోగ్యం కారణంగా చికిత్స కోసం మంచిర్యాలలోని ఆసుపత్రికి వెళ్లినట్లు కుటుంబీకులు తెలిపారు. ఈ క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకోవడంతో కుటుంబంలో తీరని విషాధం నెలకొంది. మణియమ్మకు ఇద్దరు కుమారులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - Oct 26 , 2026 | 12:01 AM