Share News

Mancherial: వ్యాపారులు మానవతా ధృక్పథంతో వ్యవహరించాలి

ABN , Publish Date - Nov 11 , 2026 | 11:21 PM

చెన్నూరు, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో పరిస్థితుల్లో బియ్యం వ్యాపారులు మానవతా దృక్ప థంతో వ్యవహరించి ప్రజలకు బియ్యం ధరలను అందుబాటులో ఉంచాలని కలెక్టర్‌ కుమార్‌దీపక్‌ అన్నారు.

Mancherial:  వ్యాపారులు మానవతా ధృక్పథంతో వ్యవహరించాలి
చెన్నూరులో బియ్యం విక్రయ కేంద్రాన్ని ప్రారంభిస్తున్న కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

చెన్నూరు, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో పరిస్థితుల్లో బియ్యం వ్యాపారులు మానవతా దృక్ప థంతో వ్యవహరించి ప్రజలకు బియ్యం ధరలను అందుబాటులో ఉంచాలని కలెక్టర్‌ కుమార్‌దీపక్‌ అన్నారు. బుధవారం పట్టణంలోని అంబేద్కర్‌చౌక్‌, గాంధీచౌక్‌లలో శ్రీలక్ష్మీట్రేడర్స్‌ రైస్‌డిపో, దేవుడా రైస్‌డిపో వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బియ్యం విక్రయకేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ 26 కిలోల బరువుతో కూడిన బీపీటీ కొత్తబియ్యం బ్యాగ్‌ను రూ.1,430, బీపీటీ స్టీమ్‌ బియ్యం రూ.1612, హెచ్‌ఎంటీ స్టీమ్‌బియ్యం రూ.1898, హెచ్‌ఎంటీ పాతబియ్యం బస్తా రూ.1976, జేఎస్‌ఆర్‌ పాతబియ్యం రూ.2028చొప్పున విక్రయిం చాలన్నారు. అనంతరం చెన్నూరులోని కస్తూర్బా గాంధీ బాలికలవిద్యాలయాన్ని సందర్శించి పాఠశా లలో కొనసాగుతున్న అదనపుతరగతి గదుల నిర్మాణ పనులను పరిశీలించారు. పనులను నాణ్యతతో చేప ట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి భోజనం నాణ్యత, వంటశాల, పరిసరాలు, పరిశుభ్రత తదితర అంశా లను సమర్ధవంతంగా చేపట్టాలని సూచించారు. విద్యార్థినులకు మెనూప్రకారం భోజనం అందించాలని సూచిం చారు. అనంతరం మండల తహ సీల్దార్‌ కార్యాలయాన్ని తహసీ ల్దార్‌ మల్లికార్జున్‌తోకలిసి పరిశీ లించారు. జీవోనంబరు 76,58,59 కిందవచ్చిన దరఖాస్తులు, భూభా రతి కార్యక్రమం,భూముల రీసర్వే, కళ్యాణలక్ష్మీ, షాదిముబారక్‌ పథ కాలకు సంబంధించిన అంశాలను పరిశీలించారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలకింద పెండిం గ్‌లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి, అర్హులైన వారి కి పథకంఫలాలు మంజూరు చేసేందుకు అవసర మైన ప్రక్రియను పూర్తిచేయాలన్నారు. ఓటరు జాబి తా ప్రత్యేకసమగ్రసవరణ ప్రక్రియను వేగవంతం చేయాలనిసూచించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ మారుతిప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

భీమారం : మండలకేంద్రంలోని సమతా రైస్‌ డిపో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బియ్యం విక్రయ కేంద్రాన్ని కలెక్టర్‌ కుమార్‌దీపక్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎల్‌నినో పరిస్థితుల్లో బియ్యం వ్యాపారులు ప్రజలకు బియ్యం ధరలను అందుబాటులో ఉంచాలన్నారు. తనిఖీల కోసం వచ్చే బృందాలకు వ్యాపారులు,ట్రేడర్లు సహకరించాలన్నా రు. నిబంధనల ప్రకారం బియ్యం విక్రయించాలని నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో అద నపు కలెక్టర్‌ రాములు, జిల్లా పౌరసరఫరాల అధికారి వేణుగోపాల్‌, తహసీల్దార్‌ సదానందం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 11 , 2026 | 11:21 PM