Mancherial: వినాయక నిమజ్జనాన్ని ప్రశాంతంగా నిర్వహించుకోవాలి
ABN , Publish Date - Sep 23 , 2026 | 11:29 PM
దండేపల్లి, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): వినాయక నిమజ్ఞనాన్ని ప్రశాంత వాతావరణంలో జరిగేలా అవస రమైన ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ కుమార్‌దీపక్ అధికా రులను ఆదేశించారు.
కలెక్టర్ కుమార్ దీపక్
దండేపల్లి, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): వినాయక నిమజ్ఞనాన్ని ప్రశాంత వాతావరణంలో జరిగేలా అవస రమైన ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ కుమార్‌దీపక్ అధికా రులను ఆదేశించారు. బుధవారం మండలంలోని గూడెం గోదావరి వినాయకనిమజ్ఞనం చేసే ప్రదేశాన్ని ఎంపీడీవో జేఆర్ ప్రసాద్, ఎస్సై రాజవర్థన్‌తో కలిసి పరిశీలించారు. నిమజ్ఞన ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిం చారు. అనంతరం మండల కేంద్రంలో కొనసాగుతున్న ఓటరుజాబితా ప్రత్యేక సమగ్రసవరణను పరిశీలించారు. సిబ్బందికి సూచనలు సలహాలు ఇచ్చారు. మండల కేంద్రం లోని పీహెచ్‌సీని సందర్శించి సీజనల్ వ్యాధుల పట్ల వైద్యు లు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. వార్డులు, మం దుల నిల్వలు, రిజిస్టర్లను పరిశీలించారు. రోగులతో మాట్లా డి ఆసుపత్రిలో అందుతున్న వైద్యసేవలపై ఆరాతీశారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని నిర్లక్ష్యం చేస్తే కఠినచర్యలు తప్పవన్నారు.
మండలంలోని ద్వారక జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాల, కర్ణపేట కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శిం చారు. విద్యార్థులకు పాఠాలు బోధించారు. తహసీల్దార్ రోహిత్‌దేశ్‌పాండే, ఎంపీడీవో జేఆర్‌ప్రసాద్‌తో కలిసి విద్యా లయ పరిసరప్రాంతాలను పరిశీలించారు. ద్వారక పాఠశా లలో కొనసాగుతున్న వసతిగృహా పనులను పరిశీలించి, అధికారులకు సూచనలు చేశారు. తరగతిగదులు, రిజిస్టర్లు, విద్యాభోదన, పరిసరాలను పరిశీలించారు.