Mancherial: సర్ ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలి
ABN , Publish Date - Sep 02 , 2026 | 11:50 PM
నెన్నెల, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): ఓటరు జాబితా ప్రత్యేకసవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను పార దర్శకంగా నిర్వహించాలని అదనపుకలెక్టర్ చంద్రయ్య అన్నారు.
-అదనపు కలెక్టర్ పి చంద్రయ్య
నెన్నెల, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): ఓటరు జాబితా ప్రత్యేకసవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను పార దర్శకంగా నిర్వహించాలని అదనపుకలెక్టర్ చంద్రయ్య అన్నారు. బుధవారం మండల కేంద్రం లో ఎస్‌ఐఆర్ నోటీసుల పంపిణీ, ఫారాల స్వీకరణ, వివరాల నమోదుకార్యక్రమాన్ని పరిశీలించారు. అన్‌మ్యాపింగ్, సవరణల నోటీసులు ఎందరికి అందజేశారు?. తిరిగి ఎందరి నుంచి ధ్రువీకరణ పత్రాలు స్వీకరించారో బీఎల్‌వోలను అడిగి తెలుసు కున్నారు. అన్‌మ్యాపింగ్ అయిన వారినుంచి పత్రా లతోపాటు లైవ్‌ఫొటో తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం సూచించిన పత్రాలను మాత్రమే అప్‌లోడ్ చేయాలన్నారు.
ఫ పనులు పరిశీలించి..
సూచనలు చేసి..
అదనపు కలెక్టర్ చంద్రయ్య పలు గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించారు. చిత్తాపూర్‌లో స్వయం సహాయక సంఘాల మహిళలు చేపడు తున్న వీబీ జీరామ్‌జీ పథకం, జలసిరి నీటికుంట నిర్మాణం పను లను పరిశీలించారు. వీవో భవన నిర్మాణం పనులు పరిశీలించి పనుల్లో నాణ్యతాప్రమాణాలు పాటించాలని సూచించారు. జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలను సంద ర్శించి విద్యార్థులతో మాట్లాడారు. చదువులో వెనుకబడిన పిల్లలపై ప్రత్యేకశ్రద్ధ పెట్టాలన్నారు. మండలసమాఖ్య ఆధ్వ ర్యంలో స్కూల్‌యునిఫాంల కుట్టుకేంద్రాలను సందర్శించారు. నెన్నెలలో కస్తూర్బాగాంధీ పాఠశా లను తనిఖీచేశారు. ఎఫ్‌ఆర్‌ఎస్ హాజరు నమోదు, అపార్ ఎంట్రీ తదితర అంశాల గూర్చి సిబ్బందితో చర్చించారు. మెనూ అమలు, భోజనంలో నాణ్యత, సిలబస్ గూర్చి విద్యార్థులను అడిగితెలుసుకున్నా రు. ఎంపీడీవో పూర్ణచందర్‌రావు, ఎంపీవో శ్రీనివాస్, ఏపీవో నరేస్, ఏపీఎం త్రయంబకేశ్వర్ ఉన్నారు.