Share News

Mancherial: నిర్ణీత గడువులోగా సర్‌ ప్రక్రియను పూర్తి చేయాలి

ABN , Publish Date - Oct 07 , 2026 | 11:51 PM

జైపూర్‌, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): జిల్లా లో చేపట్టిన సర్‌ ప్రక్రియను నిర్ణీత గడువు లోగా పూర్తిచేయాలని రాష్ట్ర విద్యాశాఖ కార్య దర్శి, జిల్లా ఎలక్ర్టోరల్‌ రోల్‌ అబ్జర్వర్‌ యోగి తారాణా పేర్కొన్నారు.

Mancherial:  నిర్ణీత గడువులోగా సర్‌ ప్రక్రియను పూర్తి చేయాలి

జైపూర్‌, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): జిల్లా లో చేపట్టిన సర్‌ ప్రక్రియను నిర్ణీత గడువు లోగా పూర్తిచేయాలని రాష్ట్ర విద్యాశాఖ కార్య దర్శి, జిల్లా ఎలక్ర్టోరల్‌ రోల్‌ అబ్జర్వర్‌ యోగి తారాణా పేర్కొన్నారు. బుధవారం మండలం లోని ఇందారం జిల్లా పరిషత్‌ ఉన్నతపాఠశా లలో ఏర్పాటుచేసిన 111,112పోలింగ్‌ కేంద్రా లను సందర్శించి సంబంధిత బూత్‌స్థాయి అధికారులను వివరాలను అడిగి తెలుసుకు న్నారు. బూత్‌స్థాయి అధికారులు ఫారం7 దరఖాస్తుల విష యంలో రిజిస్టర్‌ నిర్వహించి పూర్తివివరాలను నమోదు చేయాలన్నారు. ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లందరూ ఒకే పోలింగ్‌ కేంద్రంలో ఉండేలా చర్యలు తీసు కోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ రాములు, తహసీల్దార్‌ వనజారెడ్డి, ఎంపీడీవో శ్రీపతి బాపురావు, సర్పంచు ఫయాజ్‌, బీఎల్‌ వోలు పాల్గొన్నారు.

Updated Date - Oct 07 , 2026 | 11:51 PM