Share News

Mancherial: పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం

ABN , Publish Date - Oct 21 , 2026 | 11:54 PM

మంచిర్యాలక్రైం, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని రామ గుండం పోలిస్‌కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ ఝా పేర్కొ న్నారు. బుధవారం రామ గుండం పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో అమర వీరుల స్థూపం వద్ద పోలీసు అమరవీరుల సంస్మ రణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వ హించారు. క

Mancherial:  పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం

మంచిర్యాలక్రైం, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని రామ గుండం పోలిస్‌కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ ఝా పేర్కొ న్నారు. బుధవారం రామ గుండం పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో అమర వీరుల స్థూపం వద్ద పోలీసు అమరవీరుల సంస్మ రణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వ హించారు. కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌తో కలిసి అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. అనంతరం ఆర్‌ఐ శేఖర్‌ ఆధ్వర్యంలో సాయుధ పోలీసులు శోకశస్త్రం నిర్వహిం చారు. రెండునిమిషాలు మౌనం పాటించి అమరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లా డుతూ 1959 అక్టోబర్‌ 21న లడఖ్‌లోని హాట్‌ స్ర్పింగ్స్‌ ప్రాంతంలో సరిహద్దు పర్యవేక్షణ విధులు నిర్వహి స్తున్న సీఆర్‌పీఎఫ్‌ బృందంపై చైనా బలగాలు దాడి చేయగా మనజవాన్‌లు ధైర్యంగా పోరాడి ప్రాణత్యాగం చేశారన్నారు. వారిత్యాగాలకు గుర్తుగా ప్రతి సంవ త్సరం అక్టోబర్‌ 21న పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామన్నారు. కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ మాట్లాడుతూ విధినిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరులను స్మరించుకోవడం, వారి త్యాగాలను గుర్తు చేసుకోవడం కోసం ప్రతి సంవత్సరం పోలీసు అమరువీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు రాంరెడ్డి, రమేష్‌, శ్రీనివాస్‌, రవీందర్‌, శ్రీనివాస్‌, అమరవీరుల కుటుంబ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Oct 21 , 2026 | 11:54 PM