Share News

Mancherial: పీహెచ్‌సీలో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలి

ABN , Publish Date - Sep 23 , 2026 | 11:23 PM

భీమిని, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి) : ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో సాధారణ ప్రస వాల సంఖ్యను పెంచాలని మాతాశిశు ఆరోగ్య సంరక్షణాధికారి (ఎంసీహెచ్‌వో) ఆరుణశ్రీ అన్నారు.

 Mancherial:  పీహెచ్‌సీలో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలి

- మాతాశిశు ఆరోగ్య సంరక్షణాధికారి అరుణశ్రీ

భీమిని, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి) : ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో సాధారణ ప్రస వాల సంఖ్యను పెంచాలని మాతాశిశు ఆరోగ్య సంరక్షణాధికారి (ఎంసీహెచ్‌వో) ఆరుణశ్రీ అన్నారు. బుధవారం స్థానిక ఆరోగ్యకేంద్రాన్ని ఆమె తనిఖీచేశారు. ఆమె ఆసుపత్రికి వచ్చినప్పటికీ సిబ్బంది ఆల స్యంగా రావడం, సమయపాలన పాటించక పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆరోగ్య కేంద్రంలో ఇప్పటివరకు జరిగిన ప్రసవాల వివరాలను, గర్భిణులకు అందిస్తున్న సేవలను, రికార్డుల నిర్వహణ తదితర అంశాలను వైద్యురాలు నిర్మలను అడిగి తెలుసుకున్నారు. గర్భిణుల వివరాల నమోదు, పర్యవేక్షణ, హైరిస్కు కేసుల గుర్తింపు, క్రమబద్ధమైన తనిఖీల వివరా లను తెలుసుకున్నారు. ప్రసవగది 24గంటలు అందుబాటులో ఉండేలా అవస రమైన మందులు, పరికరాలను సిద్ధంగా ఉండేలా చూసుకోవాలన్నారు. సిబ్బంది విధులపట్ల నిరక్ష్యం వహిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో వైద్యు రాలు నిర్మల, హెచ్‌ఏ ఉమాశంకర్‌, హెచ్‌ఎస్‌ ఇందిర, సీహెచ్‌వో పున్నమయ్య, వైద్యసిబ్బంది తది తరులు ఉన్నారు.

Updated Date - Sep 23 , 2026 | 11:23 PM