Mancherial: హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి
ABN , Publish Date - Sep 19 , 2026 | 12:05 AM
చెన్నూరు, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): ఓటరు జాబితా సమగ్ర సవరణలో మ్యాపింగ్ కానీ అనామలిస్‌జాబితాలోగల ఓటర్లకు అందిం చిన నోటీసుల ప్రకారం హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలని అదనపుకలెక్టర్ రాములు అన్నారు.
చెన్నూరు, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): ఓటరు జాబితా సమగ్ర సవరణలో మ్యాపింగ్ కానీ అనామలిస్‌జాబితాలోగల ఓటర్లకు అందిం చిన నోటీసుల ప్రకారం హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలని అదనపుకలెక్టర్ రాములు అన్నారు. శుక్రవారం చెన్నూరు మండల కార్యాల యాన్ని సందర్శించారు. అధికారులతో సమా వేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సమగ్రసవరణ ప్రక్రియలో భాగంగా రానున్న రెండురోజుల్లో పురోగతి స్పష్టంగా కనిపించేలా చర్యలు చేపట్టాలన్నారు. పెండింగ్‌లో ఉన్న సాదాబైనామా, భూభారతి దరఖాస్తులను త్వర గాపరిష్కరించాలన్నారు. చెన్నూరులో భూముల రీసర్వేలో సరిహద్దుల నిర్ధారణ ప్రక్రియను క్షేత్ర స్థాయిలో పరిశీలించి పూర్తి చేయాలన్నారు.
- సాదాబైనామా దరఖాస్తులను పరిశీలించాలి
భీమారం : సాదాబైనామా దరఖాస్తులను పరిశీలించాలని అదనపుకలెక్టర్ రాములు అన్నా రు. శుక్రవారం మండల కేంద్రం లోని తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. సాదాబైనామా దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలన్నారు. రైతులకు న్యాయం జరిగేలా అధికారులు కృషి చేయాలన్నారు. అనంతరం సర్ ప్రక్రియపై తహసీల్దార్ సదానందంను అడిగి తెలుసు కున్నారు. అర్హులైన వారందరు ఓటరు జాబి తాలో ఉండేలా చూడాలన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.