Mancherial: ఆటో డ్రైవర్ల సమ్మెపై ప్రభుత్వం స్పందించాలి
ABN , Publish Date - Aug 23 , 2026 | 11:40 PM
మందమర్రిటౌన్, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): సమస్యలను పరిష్కరించాలని ఆటోడ్రైవర్లు చేపట్టిన బంద్‌పై ప్రభుత్వం వెంటనే స్పందించాలని మందమర్రి
మందమర్రిటౌన్, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): సమస్యలను పరిష్కరించాలని ఆటోడ్రైవర్లు చేపట్టిన బంద్‌పై ప్రభుత్వం వెంటనే స్పందించాలని మందమర్రి ఆటో ఐక్యకార్యచరణసమితి నాయకులు మొయ్యరాం బాబు, నేరెళ్లవెంకటేష్, పంబాల శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆదివారం ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రెండున్నర సంవత్సరాలలో ఆటోడ్రైవర్ల పరిస్థితి అధ్వానంగా మారిందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఆటోలకు గిరాకీలు లేకుండా పోయా యని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 8లక్షల మంది ఆటో డ్రైవర్లు ఆటోలు నడుపుతూ జీవనోపాధి పొందుతున్నా రన్నారు. చలాన్‌లు, ఇన్సూరెన్స్, ఫిట్‌నెస్ ఖర్చులు పెరిగి పోవడం, ఫైనాన్స్‌లోకొన్న ఆటోలకు ఈఎంఐలు కట్టలేక చాలామంది ఆటోడ్రైవర్లు ఆత్మహ త్యలు చేసుకున్నార న్నారు. ఈవీ ఆటోలను ప్రభుత్వం విరమించుకోవాలని, సంవత్సరానికి రూ.12వేలు ఇవ్వాలని, ఆత్మహత్యలు చేసుకున్న ఆటోడ్రైవర్లకు రూ.25లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లిం చాలన్నారు. ఓలా,ఊబర్, ర్యాపిడోలను రద్దు చేయాల న్నారు. ప్రభుత్వం స్పందించి డిమాండ్లను నెరవేర్చాల న్నారు. అనంతరం నల్లబ్యాడ్జీలు ధరించి ఆటోలతో నిరసన తెలిపారు. సమావేశంలో నాయకులు క్రాంతి, ప్రభాకర్, అంజి, సంపత్, రవి, లక్ష్మణ్, రాజు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ఆటో డ్రైవర్లకు వివిధ పార్టీల మద్దతు..
బెల్లంపల్లి/మందమర్రిటౌన్/మంచిర్యాల కలెక్టరేట్ /కాసిపేట: ఆటోడ్రైవర్ల బంద్‌కు ఎంసీపీ ఐయూ పార్టీ మద్దతు తెలుపుతుందని ఎంసీపీఐయూ, అఖిల భారత కార్మికసంఘాల కేంద్రం జిల్లాకార్యదర్శి పసులేటి వెంకటేష్ అన్నారు. ఆదివారం పార్టీ కార్యా లయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లా డుతూ ఆటో డ్రైవర్లకు ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చిన మేరకు ఆటోడ్రైవర్లకు సంవత్సరానికి రూ.12వేలు అందించాలని, ఈవీఆటోలను ఇవ్వాలనే ప్రతి పాదనలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. వెయ్యికోట్లతో సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు. సమావేశంలో నాయకులు రమేష్, సతీష్, రాహుల్‌పాల్గొన్నారు. మందమర్రికి చెందిన టీడీపీ, జనసేన, బీజేపీ, వ్యాపార సంఘం నాయకులు మద్దతుతెలిపారు. టీడీపీ పట్టణాధ్య క్షుడు వాసాల సంపత్, జనసేన నాయకుడు మాయ రమేష్, బీజేపీ పట్టణాధ్యక్షుడు సప్పిడి నరేష్, వ్యాపారసంఘం అధ్యక్షుడు తమ్మిశెట్టి విజయ్ మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే ఆటోడ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని కోరారు. కాగా ఆటో డ్రైవర్ల సమస్యలను ప్రభుత్వ పట్టించుకోవడం లేదని మార్కెట్ సెంటర్‌లో ఆటో డ్రైవర్లు నిరసన తెలిపారు. ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని హెచ్‌ఎంఎస్ జిల్లా అధ్యక్షుడు నరెడ్ల శ్రీనివాస్ ఆదివారం ఒక ప్రక టనలో తెలిపారు. ఆటోల బంద్‌కు హెచ్‌ఎంఎస్ సంపూర్ణ మద్దతు తెలుపుతుందన్నారు. ఆటోడ్రైవర్ల సమ్మెకు సీపీఐ (ఏఎం) సంపూర్ణ మద్దతు తెలుపుతుందని జిల్లా కార్యదర్శి సంకె రవి తెలిపారు. ఆదివారం కాసిపేట మండలం సోమగూడెంలో ఆటోడ్రైవర్లతో కలిసి ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో దూడం రాజు, రామారావు, వీరయ్య, రమేష్, లింగమయ్య, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.