Share News

Mancherial: పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యం

ABN , Publish Date - Nov 24 , 2026 | 11:55 PM

చెన్నూరు, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): పేద, బడుగు, బలహీనవర్గాల కుటుంబా లకు ఆర్థిక భరోసా కల్పించడమే కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర కార్మిక, గనులశాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామి అన్నారు.

Mancherial: పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యం
మాట్లాడుతున్న మంత్రి వివేక్‌వెంకటస్వామి

-మంత్రి వివేక్‌వెంకటస్వామి

చెన్నూరు, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): పేద, బడుగు, బలహీనవర్గాల కుటుంబా లకు ఆర్థిక భరోసా కల్పించడమే కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర కార్మిక, గనులశాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామి అన్నారు. మంగ ళవారం మండలంలోని గంగారం గ్రామంలో ఇంది రమ్మ కుటుంబ జీవితబీమా పథకాన్ని ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఫలాలు నేరుగా అందేలా అధికా రులు చర్యలు తీసుకోవాలన్నారు. ఇంటికి పెద్దదిక్కును కోల్పోయి ఆపదలోఉన్న కుటుంబాలకు ఈ బీమాపథకం కొండంత అండగా నిలుస్తుందన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభు త్వంలో 40లక్షల మందికే రైతు బీమా ఉండేదని, కానీ ఇప్పుడు కోటి మందికి పైగా ఇందిరమ్మ కుటుం బ జీవిత బీమా పథకం అమలు చేస్తున్నామన్నారు. భూమి ఉంటేనే గతంలో ఇన్సూ రెన్స్‌ వచ్చేదని, కానీ ఇప్పుడు ప్ర తి కుటుంబానికి బీమా సదుపా యం కల్పిస్తున్నామన్నారు. ఈ గ్రామానికి 25 ఇందిరమ్మ ఇళ్లు కావాలని అడిగారని, వెంటనే ఇళ్లను మంజూరు చేశానన్నారు. త్వరలో చెన్నూరులో బస్‌డిపో, వందపడకల ప్రభుత్వ ఆసుపత్రిని ప్రారంభించనున్నామ న్నారు. మహిళలకు ఫ్రీబస్‌ కోసం ప్రభుత్వం రూ.9వేల కోట్లను చెల్లించామన్నారు. గంగా రం గ్రామం అభివృద్ధికి రూ.50లక్షల నిధు లను మంజూరు చేశామన్నారు. రూ.250 కోట్లతో సోమనపల్లిలో ఇంటిగ్రేటెడ్‌స్కూల్‌ పనులు వేగంగా కొనసాగు తున్నాయన్నారు. పుష్కరాల కోసం రూ.70కోట్లతో పనులు చేపడుతు న్నామన్నారు. ప్రజల సంక్షేమమే తమ ధ్యేయమన్నారు. కార్యక్రమంలో కలె క్టర్‌ కుమార్‌ దీపక్‌, ఎంపీడీవో అజ్మత్‌అలీ, సర్పంచులు, అధికారులు, ప్రజలు పాల్గొ న్నారు.

Updated Date - Nov 24 , 2026 | 11:55 PM