Mancherial: డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలి
ABN , Publish Date - Jul 31 , 2026 | 11:02 PM
మంచిర్యాల కలెక్టరేట్, జూలై 31 (ఆంధ్రజ్యోతి) : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా చేపట్టిన ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలై జేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని
మంచిర్యాల కలెక్టరేట్, జూలై 31 (ఆంధ్రజ్యోతి) : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా చేపట్టిన ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలై జేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ కుమార్‌దీపక్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సర్‌ప్ర క్రియ, ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్‌పై సమావేశం నిర్వ హించారు. కలెక్టర్ మాట్లాడుతూ సర్‌లో సేకరించిన ఎన్యుమ రేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ నిర్ణీతగడవు కంటే ముందుగానే పూర్తిచేసే విధంగా అధికారులు, రాజకీయ ప్రతినిధులు సమన్వయంతో కృషి చేయాలన్నారు. డబుల్, డెత్, షిఫ్ట్ అయిన వారి ఓట్లను నిబంధనల ప్రకారం తొలగిస్తామన్నారు. ఇంకా ఎన్యుమరేషన్ ఫారాలు అందించని వారిని గుర్తించి బూత్‌స్థాయి ఏజెంట్ల ద్వారా ఫారాలను అధికారులకు సమర్పించే విధంగా చర్యలు తీసుకోవా లన్నారు. ఒక కుటుంబంలోని ఓటర్లందరు ఒకేపో లింగ్ కేంద్రంలో ఓటుకలిగి ఉండేలా చర్యలు తీసుకో వాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌లు చంద్రయ్య, రాములు, రెవెన్యూ అధికారి మోతీరాం, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ చంద్రకళ, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.
ఆదివాసీ దినోత్సవాన్ని
ఘనంగా నిర్వహించాలి..
ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల9న జిల్లావ్యాప్తంగా ఆదివాసీ సంస్కృతి సంప్ర దాయాలు, హక్కులపై అవగాహన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం కలెక్టర్ చాంబర్‌లో ఆదివాసీ దినోత్సవ కార్యనిర్వహణ కమిటీ ప్రతినిధులతో కలిసి ఛలో మంచిర్యాల కార్యక్రమం కరపత్రాలను ఆవిష్కరించి మాట్లాడారు.
ఆదివాసీల అభ్యున్నతికి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అర్హులైన వారికి చేరేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆదివాసీ దినోత్సవం సందర్భంగా కార్యక్రమాలను సంస్కృతీ, సంప్రదాయాలు ప్రతిబింబించేలా నిర్వహిం చాలని తెలిపారు. కార్యక్రమంలో కార్యనిర్వహణ కమిటీ ప్రతినిధులు అర్జున్, లక్ష్మణ్, జంగు, తిరుపతి, రాజన్న, జంగు, హన్మంతు, అనిల్, వెంకటేష్, పృద్విరాజ్, వెంకటేష్, తిరుపతి, శ్రావణ్, అరుణ్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.