Mancherial: మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా విద్యాబోధన చేయాలి
ABN , Publish Date - Jul 08 , 2026 | 11:36 PM
మంచిర్యాలక్రైం, జూలై 8 (ఆంధ్రజ్యోతి): మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా విద్యార్థులకు బోధనఅందించాలని అదనపుకలెక్టర్ (స్థానిక సంస్థలు) చంద్రయ్య అన్నారు.
అదనపు కలెక్టర్ చంద్రయ్య
మంచిర్యాలక్రైం, జూలై 8 (ఆంధ్రజ్యోతి): మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా విద్యార్థులకు బోధనఅందించాలని అదనపుకలెక్టర్ (స్థానిక సంస్థలు) చంద్రయ్య అన్నారు. ఉపాధ్యాయులు నిరంతర విద్యార్థిగా ఉంటూ ఎప్పటికప్పుడు మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా విద్యాబో ధన చేయాలని సూచించారు. ఉపాధ్యాయులకు మూడు రోజుల పాటు శిక్షణ కార్యక్రమాలు ఉంటాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో క్వాలిటి కోఆర్డినేటర్ సత్తయ్య, అధికారులు భరత్‌కుమార్, క్రిష్ణమూర్తి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.