Share News

Mancherial: అంకితభావంతో చదివి ఉన్నతశిఖరాలకు చేరుకోవాలి

ABN , Publish Date - Jul 18 , 2026 | 11:51 PM

దండేపల్లి, జూలై 18 (ఆంద్రజ్యోతి): అంకితభావంతో చదివి ఉన్నతశిఖరాలకు చేరుకోవాలని పెద్దపల్లి పార్లమెంట్‌ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ విద్యార్థులకు సూచించారు.

Mancherial:  అంకితభావంతో చదివి ఉన్నతశిఖరాలకు చేరుకోవాలి

పెద్దపల్లి పార్లమెంట్‌ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ

దండేపల్లి, జూలై 18 (ఆంద్రజ్యోతి): అంకితభావంతో చదివి ఉన్నతశిఖరాలకు చేరుకోవాలని పెద్దపల్లి పార్లమెంట్‌ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ విద్యార్థులకు సూచించారు. విశాఖ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో దండే పల్లి మండలం గూడెం ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల విద్యార్థులం దరికీ కలెక్టర్‌ కుమార్‌దీపక్‌, ఆదనపుకలెక్టర్‌, ఇన్‌చార్జి డీఈవో చంద్రయ్యతోకలిసి స్కూల్‌ బ్యాగులను పంపిణీచేశారు. ఈ సంద ర్భంగా పాఠశాలకువచ్చిన ఎంపీకి విద్యా ర్థులు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ తమ విశాఖ చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థుల విద్యాభివృద్ధికి ఎంతో చేయూతనందిస్తున్నామన్నారు. విద్యార్థులు దేశం గర్వించే స్థాయికి ఎదగాలని, గూడెం పాఠశాలను రాష్ట్రస్థాయిలో నిలబట్టేలా కృషిచేయాలని విద్యార్థులకు సూచించారు. బ్యాగ్స్‌పంపిణీకి వచ్చిన ఎంపీ విద్యార్థులు నేలపై కూర్చోగా ఆయన కూడా వారితో నేలపై కూర్చుని ముచ్చటించారు. వెంటనే తమవిశాఖ ట్రస్ట్‌ ద్వారా విద్యార్థులకుబెంచీలను అందజేస్తామన్నారు. పాఠశాలకు మౌళిక సదుపాలను కల్పించి, విద్యాభివృద్ధికి మరింత కృషిచేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు పిన్నింటి రఘనాథ్‌రెడ్డి, ఎంఈవో మంత్రిరాజు, హెచ్‌ఎం మల్లయ్య, నాయకులు సత్యం రావు, రాజేందర్‌, శ్రీనివాస్‌, సునీల్‌, సత్తయ్య, కమలాకర్‌, తిరుపతి, సుభాష్‌ తదితరులు పాల్గొన్నారు.

మృతుల కుటుంబాలను పమర్శించి..

మండలంలోని గూడెంలో చింతమల్లేష్‌, నాగ సముద్రంలో దుర్గం పోషం, గూడమల్లేష్‌ మృతుల కుటుంబాలను ఎంపీ పరామర్శించారు. బాధిత కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కుటుంబసభ్యు లతో మాట్లాడి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అండగా ఉంటామని వారికి భరోసా కల్పించారు.

Updated Date - Jul 18 , 2026 | 11:51 PM