Mancherial: విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం అందించాలి
ABN , Publish Date - Aug 12 , 2026 | 11:59 PM
జైపూర్, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు భోజనం అందించాలని కలెక్టర్ కుమార్‌దీపక్ పేర్కొన్నారు.
జైపూర్, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు భోజనం అందించాలని కలెక్టర్ కుమార్‌దీపక్ పేర్కొన్నారు. మండలకేంద్రంలోని తెలం గాణ సాంఘికసంక్షేమ బాలురపాఠశాలను సందర్శిం చారు. తరగతిగదులు, మూత్రశాలలు, వసతి, వంట శాల, సామాగ్రి నిల్వగదిని, పరిసరాలను, కొనసాగు తున్న మరమ్మతు పనులను పరిశీలించారు. కలెక్టర్ మాట్లడుతూ విద్యార్థులకు అవసరమైన సకల సౌకర్యా లను కల్పించి నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఉపాధ్యా యులు మెనూప్రకారం భోజనం అందించాలన్నారు. కొనసాగుతున్న మరమ్మతు పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట ప్రిన్సిపాల్ నాగేశ్వర్‌రావు ఉన్నారు.
విద్యార్థినుల ఆరోగ్యంపై
శ్రద్ధ వహించాలి..
చెన్నూరు : విద్యార్థినుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని కలెక్టర్ కుమార్‌దీపక్ అన్నారు. బుధవారం చెన్నూరు మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యా లయాన్ని ఆయన సందర్శించారు. అదనపు గదుల నిర్మాణపనులను పరిశీలించి త్వర గా పూర్తిచేయాలని సూచించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థినులకు నాణ్యమైన భోజనం మెనూప్రకారం అందించాలన్నారు. భోజనం తయారీలో శుభ్రత, నిబంధనలు పాటించాలన్నారు. వెనకబడిన వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలన్నారు. అనంతరం గిరి జనసంక్షేమబాలుర ఉన్నతపాఠశాలను సందర్శించి వంటశాల, మూత్ర శాలలు, కొనసాగుతున్న అదనపు గదుల నిర్మాణ పను లను పరిశీలించి పలు సూచనలు చేశారు.