Share News

Mancherial: విద్యార్థులకు మెరుగైన బోధన చేయాలి

ABN , Publish Date - Jul 22 , 2026 | 11:47 PM

నస్పూర్‌, జూలై 22 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశా లల్లో విద్యార్థులకు మెరుగైన విద్యాభోదన చేయాలని కలెక్టర్‌ కుమార్‌దీపక్‌ అన్నారు.

 Mancherial:  విద్యార్థులకు మెరుగైన బోధన చేయాలి

- కస్తూర్బా విద్యాలయాన్ని పరిశీలించిన కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

నస్పూర్‌, జూలై 22 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశా లల్లో విద్యార్థులకు మెరుగైన విద్యాభోదన చేయాలని కలెక్టర్‌ కుమార్‌దీపక్‌ అన్నారు. కస్తూర్బా విద్యాలయాన్ని బుధవారం రూరల్‌సీఐ గోపతి రవీందర్‌తో కలిసి సంద ర్శించారు. భద్రత చర్యల్లో భాగంగా సీసీ కెమెరాల ఏర్పా టు, వంటశాల, భోజనశాల, అదనపుగదుల నిర్మాణ పనులను పరిశీలించారు. ఇంటర్మీడియట్‌ విద్యార్థులతో భోదనవివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సంద ర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ బాలికల భద్రతను దృష్టి లో పెట్టుకుని సీసీకెమెరాలను ఏర్పాటు చేస్తామన్నారు. పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి పూర్తి చేయాలన్నారు. విద్యార్థులకు మెనూప్రకారం పోషకవిలువలతో కూడిన ఆహారం, శుద్ధమైన తాగునీరు అందించాలన్నారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని సూచించారు. వర్షకాలం కావడంతో విద్యా ర్థుల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్య క్రమంలోప్రిన్సిపాల్‌మౌనిక, రూరల్‌సీఐ గోపతి రవీందర్‌, ఎస్సై ప్రశాంత్‌, విద్యార్థులు, ఉపాధ్యాయులున్నారు.

ఫ తహసీల్దార్‌ కార్యాలయం సందర్శించి..

నస్పూర్‌ తహసీల్దార్‌ కార్యాలయాన్ని బుధవారం కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ సందర్శించారు. ఓటర్ల జాబిత ప్రత్యేక సమగ్ర సవరణప్రక్రియ నిర్వహణను పరిశీలిం చారు. ప్రజల నుంచి వచ్చిన ఎన్యూమరేషన్‌ ఫారాల డిజిటలైజేషన్‌ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ఎలాంటి పొరపాట్లు లేకుండా స్పష్టంగా వివరాలను పమోదు చేయాలన్నారు. భూ భారతి, సాదాబైనామా, రెవెన్యూసదస్సులలో వచ్చిన దరఖా స్తుల పరిష్కార ప్రక్రియ తీరును పరిశీలించి పలు సూచనలు చేశారు.

‘సర్‌’ని విజయవంతంగా

పూర్తి చేయాలి

మందమర్రిరూరల్‌ : సర్‌ కార్యక్ర మాన్ని విజయవంతంగా పూర్తిచేయా లని కలెక్టర్‌ కుమార్‌దీపక్‌ సూచించా రు. బుధవారం మండల తహసీల్దార్‌ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీచేశారు. బీఎల్‌వోలు ఆగస్టు3లోగా సర్‌ కార్యక్ర మాన్ని పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అర్హు లైన ప్రతిఓటరు వివరాలు ఓటరు జాబితాలో ఉండేలా చూడాలన్నారు. సర్‌ ప్రక్రియ మండలంలో, పట్టణంలో సమర్ధవంతంగా కొనసాగుతుందని తహసీల్దార్‌ కలెక్టర్‌కు తెలిపారు.

దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి

బెల్లంపల్లి : రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తు లను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్‌ కుమార్‌దీపక్‌ అన్నారు. బుధవారం తహసీల్దార్‌, సబ్‌కలెక్టర్‌ కార్యాల యాలను సందర్శించారు. భూభారతి, సాదాబైనామాలో భాగంగా దరఖాస్తుల ప్రక్రియను పరిశీలించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుని దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలన్నారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాల న్నారు. అనంతరం భూములకు సంబంధించి దరఖాస్తు చేసుకున్న దరఖాస్తులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. కలెక్టర్‌ వెంట సబ్‌ కలెక్టర్‌ మనోజ్‌, తహసీల్దార్‌ కృష్ణ తదితరులు ఉన్నారు.

సింగరేణి భూముల పరిశీలన

తాండూర్‌ : మండలంలోని మాదారం పరిధిలోని సింగరేణిసంస్థకు సంబంధించిన భూములను బుధవా రం కలెక్టర్‌కుమార్‌ దీపక్‌ పరిశీలించారు. ఏరియా జీఎంను భూముల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించారు. ఆయన వెంట సబ్‌ కలెక్టర్‌ మనోజ్‌, తహసీల్దార్‌ జ్యోష్స్న ఉన్నారు.

Updated Date - Jul 22 , 2026 | 11:47 PM