Mancherial: విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందించాలి
ABN , Publish Date - Jul 08 , 2026 | 11:39 PM
జన్నారం, జూలై 8 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.
కలెక్టర్ కుమార్ దీపక్
జన్నారం, జూలై 8 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం మండలంలోని అక్కెపల్లి గూడలోని మండలపరిషత్ ప్రాథమికపాఠశాలను ఆయ న సందర్శించారు. విద్యార్థులకు అందిస్తున్న బోధనతీరు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థు లకు అన్నిసౌకర్యాలు అందుబాటులో ఉండాలని అన్నా రు. పౌష్టికాహారం అందించాలని మెనూ పాటించాల న్నారు. అనంతరం వంటశాల, కూరగాయలను పరిశీ లించారు. అనంతరం కిష్టాపూర్‌లో గల కస్తూర్బాగాంధీ బాలికలపాఠశాలలో నిర్మిస్తున్న అదనపుగదులు, మూత్ర శాలల నిర్మాణం, భోజనశాల నిర్మాణ పనులను పరిశీ లించారు త్వరగా పనులు పూర్తి చేయాలని అన్నారు. కవ్వాల్‌లోని ప్రభుత్వగిరిజన ఆశ్రమపాఠశాలను సంద ర్శించారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని తనిఖీచేశారు. గర్భిణులకు ఇచ్చే మందులు, ఓపీ రిజిస్టర్, వార్డులను, మందుల నిల్వల గదులను పరిశీలించారు. సీజనల్ వ్యాధులపట్ల అప్ర మత్తంగా ఉండాలని అనారోగ్యంతో వచ్చిన వారిని ఎలాంటి ఇబ్బందులకు గురి చేయవద్దని అధికారులను ఆదేశించారు. తహసీల్దార్ కార్యాలయంలో భూభారతి, ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ నిర్వహణ, ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలుపై సమీక్షించారు. భూభారతి రెవెన్యూ సదస్సులోవచ్చే దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈనెల 24లోపు ప్రత్యేక సమగ్రసవరణప్రక్రియ పూర్తిచేయా లని ఆదేశించారు. ఆయన వెంట తహసీల్దార్ బక్కయ్య, ఎంపీడీవో ఉమర్‌షరీఫ్ పాల్గొన్నారు.
ఫ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు
జరిగేలా చూడండి..
దండేపల్లి : గర్భిణులు ప్రైవేటు ఆసు పత్రుల్లో కాకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు చేయించుకునేలా చూడాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం దండేపల్లి ప్రభుత్వ ప్రాథ మిక ఆరోగ్యకేంద్రాన్ని ఆయన ఆకస్మి కంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి వార్డులను పరిశీలించి, మందుల నిల్వలు ఆరాతీసి, ఆసుపత్రికి వచ్చే రోగులకు ఇచ్చే వైద్యం తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్యసేవలు అందించాలని వైద్యులు, సిబ్బం దికి సూచించారు. గ్రామాల్లో వైద్యశిబిరాలను ఏర్పాటు చేసి రోగులకు వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా తీసుకో వాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాల న్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో జరుగుతున్న ప్రసవాల వివరాలను సేకరించి పోర్టల్‌లో నమోదుచేయాలని వైద్యాధికారిని ఆదేశించారు. ఆసుపత్రికి వచ్చే రోగులతో మర్యాదపూర్వకంగా ఉంటూ వారికి వైద్యసేవలు అందించాలని అన్నారు. అప్పుడే ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం కలుగుతుందన్నారు. విధుల పట్ల వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం చేస్తే కఠినచర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ జాదవ్ లక్ష్మి, వైద్య సిబ్బంది ఉన్నారు.