Mancherial:రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు రెబ్బనపల్లి విద్యార్థులు
ABN , Publish Date - Nov 11 , 2026 | 11:23 PM
దండేపల్లి, నవంబరు 11 (ఆంధ్ర జ్యోతి): మండలంలో రెబ్బనపల్లి ప్రభుత్వ ఉన్నతపాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్‌జీఎఫ్) అండర్14 వాలీబాల్ పోటిలకు ఎంపిక య్యారు.
దండేపల్లి, నవంబరు 11 (ఆంధ్ర జ్యోతి): మండలంలో రెబ్బనపల్లి ప్రభుత్వ ఉన్నతపాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్‌జీఎఫ్) అండర్14 వాలీబాల్ పోటిలకు ఎంపిక య్యారు. ఈనెల5న రెబ్బనపల్లి ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లాస్థాయి అండర్14 బాల బాలికల వాలీబాల్ టోర్నమెంట్ కమ్ సెలక్షన్స్‌లో విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. బాలికల విభాగంలో ఈ అక్షిత, జీ ప్రసన్న, ఎ వైష్ణవి, బాలుర విభాగంలో కే హర్షిత్, మంచిర్యాల జిల్లా జట్టు తరపున రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈనెల 13నుంచి 15వ తేదీవరకు సంగారెడ్డిజిల్లా దౌల్తాబాద్ లో నిర్వహంచనున్న రాష్ట్రస్థాయి ఎస్‌జీఎఫ్ అండర్14 వాలీబాల్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో వీరు పోల్గొనను న్నారు. విద్యార్థుల ఎంపికపట్ల పాఠశాల పీడీ గాజుల శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఎంఈవో మంత్రి రాజు, పాఠశాల ఇన్‌చార్జీ ప్రధానో పాధ్యాయుడు రూపాచారి, ఉపాధ్యాయు బృందం, జిల్లా ఎస్‌జీఎఫ్ కార్యదర్శి ఎండీ యాకుబ్, వ్యాయామ విద్య ఉపాధ్యాయసంఘం అధ్యక్ష కార్యదర్శులు బండి రవిగౌడ్, సూరసుదర్శన్, సీనియర్ పీడీలు రామ్మోహన్ రావు, సిరంగిగోపాల్, రెబ్బనపల్లి సర్పంచ్ కందుల కల్యాని-అశోక్, ఉప సర్పంచ్ వినోద్, గ్రామనాయకులు, పెద్దలు, అభినందించి రాష్ట్రస్థాయి పోటీలో రాణించాలని ఆకాంక్షించారు.