Share News

Mancherial: నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు

ABN , Publish Date - Apr 25 , 2026 | 11:49 PM

బెల్లంపల్లి, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): ఎవరైనా నకిలీ పత్తి విత్తనాలు విక్రయించినా, కొనుగోలు చేసినా కఠినచర్యలు తప్పవని డీసీపీ భాస్కర్‌ అన్నారు.

Mancherial:  నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు

-డీసీపీ భాస్కర్‌

బెల్లంపల్లి, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): ఎవరైనా నకిలీ పత్తి విత్తనాలు విక్రయించినా, కొనుగోలు చేసినా కఠినచర్యలు తప్పవని డీసీపీ భాస్కర్‌ అన్నారు. శనివారం బెల్లంపల్లిలో పోలీసు, వ్యవసాయ, రెవెన్యూశాఖల ఆధ్వర్యంలో సబ్‌డివిజన్‌లోని విత్తనాల డీలర్లు, ఏజెన్సీ నిర్వహకులతో సమావేశం నిర్వహించారు. డీసీపీ మాట్లాడుతూ నకిలీ పత్తివిత్తనాల రవా ణాకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు తగుచర్యలు చేపడుతున్నామ న్నారు. ఎప్పటికప్పుడు ఎరువుల దుకాణాలను టాస్క్‌ఫోర్స్‌ కమిటీని ఏర్పా టుచేసి తనిఖీలు చేపడుతున్నామన్నారు. ఎరువులషాపుల డీలర్లు నకిలీ విత్తనాలను రైతులకు విక్రయించవద్దన్నారు. అనుమతులు లేని విత్తనా లను విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా గ్రామాల్లో నకిలీ విత్తనాలు విక్రయిస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. అందరి సహకారంతో నకిలీ పత్తివిత్తనాలకు అడ్డుకట్ట వేస్తామని సూచించారు. కార్యక్రమంలో ఏసీపీ కిరణ్‌కుమార్‌, సీఐలు, ఎస్‌ఐలు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Apr 25 , 2026 | 11:49 PM