Share News

Mancherial: ఎస్‌ఐఆర్‌ డిజిటలైజేషన్‌ను వేగంగా పూర్తిచేయాలి

ABN , Publish Date - Jul 08 , 2026 | 11:38 PM

నెన్నెల, జులై 8 (ఆంధ్రజ్యోతి): ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్‌) కోసం ఓటర్లకు అందజేసిన ఎన్యూమరేషన్‌ ఫారముల వివరాల నమోదు తరువాత వారి నుంచి సేకరించి

Mancherial:  ఎస్‌ఐఆర్‌ డిజిటలైజేషన్‌ను వేగంగా పూర్తిచేయాలి

- అదనపు కలెక్టర్‌ రాములు

నెన్నెల, జులై 8 (ఆంధ్రజ్యోతి): ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్‌) కోసం ఓటర్లకు అందజేసిన ఎన్యూమరేషన్‌ ఫారముల వివరాల నమోదు తరువాత వారి నుంచి సేకరించి వెంటవెంటనే డిజిట లైజేషన్‌ చేయాలని అదనపుకలెక్టర్‌ (రెవెన్యూ) రాములు సూచించారు. బుధవారం ఆయన తహసీల్దార్‌ శ్రీనివాస్‌తో కలిసి మండలంలో పర్యటించారు. ఎన్యూమ రేషన్‌ ఫారాల పంపిణీ, వివరాల నమోదు, స్వీకరణ గూర్చి బీఎల్‌వోలను అడిగి తెలుసుకు న్నారు. సూపర్‌వైజర్ల సాయంతో వలంటీర్లు, బీఎల్‌వోలు వివరాల నమోదు గూర్చి ఓటర్లకు అవగాహన కల్పించాలన్నారు. ఒక పోలింగ్‌ కేంద్రంలో 1200మంది ఓటర్లకంటే ఎక్కువ లేకుండా చూడాలన్నారు. అనంతరం తహసీ ల్దార్‌ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. సాదాబై నామా దరఖాస్తుల పరిష్కారం, భూభారతి పెండిగ్‌అర్జీల గూర్చి అధికారులతో సమీక్షిం చారు. దీంతో రిజిస్ట్రేషన్‌, మ్యూటేషన్‌, విరాసత్‌ తదితర సేవలు వేగవంతంగా అందుతున్నాయ ని పేర్కొన్నారు. సమయపాలన పాటించాలని, పనుల కోసం వచ్చేవారితో స్నేహపూర్వకంగా మెదలాలని సిబ్బందికి సూచించారు.

ధాన్యం వాహనాలకు

జీపీఎస్‌ తప్పనిసరి

మంచిర్యాల కలెక్టరేట్‌: వరిధాన్యం తర లించే వాహనాలకు జీపీఎస్‌ తప్పనిసరిగా అమ ర్చాలని జిల్లాఅదనపుకలెక్టర్‌ రాములు పేర్కొ న్నారు. బుధవారం తనచాంబ ర్‌లో అధికారు లు, గుత్తేదారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లడుతూ ఈనెల 20నాటికి ధాన్యం, గోనె సంచులు రవాణా చేసే వాహనాలన్నింటికీ జీపీఎస్‌ ట్రాకింగ్‌ తప్పనిసరిగా అమర్చాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా పౌరసరఫ రాల అధికారి బ్రహ్మారావు, మేనేజర్‌ శ్రీకళ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 08 , 2026 | 11:38 PM