Share News

Mancherial: సింగరేణి రైలుకు అర్ధశతాబ్ది పూర్తి

ABN , Publish Date - Sep 02 , 2026 | 11:48 PM

మంచిర్యాల, సెప్టెంబరు 2 (ఆంధ్ర జ్యోతి): సింగరేణి ఎక్స్‌ప్రెస్‌ రైలుకు ఈ నెల2వ తేదీతో 50వసంతాలు పూర్త య్యాయి. 1976సెప్టెంబరు 2న తొలి సారిగా భద్రాచలం రోడ్డు నుంచి బెల్లం పల్లివరకు సింగరేణి రైలు ప్రారంభ మైంది.

 Mancherial:   సింగరేణి రైలుకు అర్ధశతాబ్ది పూర్తి

- పలు జిల్లాలకు విడదీయరాని అనుబంధం

మంచిర్యాల, సెప్టెంబరు 2 (ఆంధ్ర జ్యోతి): సింగరేణి ఎక్స్‌ప్రెస్‌ రైలుకు ఈ నెల2వ తేదీతో 50వసంతాలు పూర్త య్యాయి. 1976సెప్టెంబరు 2న తొలి సారిగా భద్రాచలం రోడ్డు నుంచి బెల్లం పల్లివరకు సింగరేణి రైలు ప్రారంభ మైంది. ఆ తరువాత ప్యాసింజర్‌గా స్థాయిని తగ్గించి సిర్పూర్‌టౌన్‌ వరకు పొడిగించారు. కరోనా సమయంలో ఈ రైలును ’మేమూ’ ఎక్స్‌ప్రెస్‌గా మార్చారు. రైలు ప్రారంభించిన కొత్తలో కేవలం ఎక్స్‌ప్రెస్‌ స్టాప్‌లు మాత్రమే ఉండగా, అనంతరం ప్యాసింజర్‌గా మార్చిన తరు వాత అన్నిస్టాప్‌ల్లో హాల్టింగ్‌ ఇస్తున్నారు. సింగరేణి రైలుకు రామగిరి రైలుతోపాటు, బోధన్‌నుంచి సిర్పూర్‌టౌన్‌ మేమూ ప్యాసింజర్‌లతో రేక్‌షేరింగ్‌ ఉంది. సింగరేణి ఎక్స్‌ప్రెస్‌తో కుమరంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, పెద్ద పల్లి, కరీంనగర్‌, హనుమకొండ, వరంగల్‌, మహబూబాబాద్‌, కొత్తగూడెం జిల్లాలకు విడదీయరాని అనుబంధం ఉంది. ప్రస్తుతం ఈ రైలు ఎగువమార్గంలో భద్రాచలం రోడ్డు నుంచి బల్లార్ష మధ్య దిగువమార్గంలో సిర్పూర్‌టౌన్‌ నుంచి భద్రాచలం రోడ్డు మధ్య నడుస్తోంది. ప్రారంభించిన కొత్తలో సింగరేణి ఎక్స్‌ప్రెస్‌రైలు స్టీమ్‌ ఇంజన్‌ కలిగి ఉండగా, ఆతరువాత డీజిల్‌ ఇంజిన్‌, 1995 నుంచి పూర్తిగా విద్యుత్‌ఇంజన్‌తో నడుస్తోం ది. భద్రాచలంరోడ్డు రైల్వేస్టేషన్‌లో దాదాపు పదిగంటలు ఖాళీగా ఉంటున్న కారణంగా ఈరైలును మణుగూరు వరకు పొడిగిస్తే సింగరేణి ఉద్యోగులకు ఎంతో సౌకర్యవంతం గా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమ వుతున్నాయి. సింగరేణిరైలును, ప్రారంభ తేదీని అప్పట్లో బెల్లంపల్లి పోస్టుకార్డుపై ముద్రించడం ప్రజలకు దానితో ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తుంది.

Updated Date - Sep 02 , 2026 | 11:48 PM