Share News

Mancherial: పట్టు పురుగుల పెంపకం రైతుల రాస్తారోకో

ABN , Publish Date - Oct 28 , 2026 | 11:53 PM

చెన్నూరు, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): మండలంలో ఆంక్షలతో అటవీశాఖ అధికా రులు నిత్యం వేధిస్తున్నారని పేర్కొంటూ దసరి పట్టుపురుగు పెంపకం రైతులు రోడ్డె క్కారు.

Mancherial:  పట్టు పురుగుల పెంపకం రైతుల రాస్తారోకో

చెన్నూరు, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): మండలంలో ఆంక్షలతో అటవీశాఖ అధికా రులు నిత్యం వేధిస్తున్నారని పేర్కొంటూ దసరి పట్టుపురుగు పెంపకం రైతులు రోడ్డె క్కారు. బుధవారం చెన్నూరు-మంచిర్యాల ప్రధానరహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. ఈసందర్భంగా రైతులు మాట్లా డుతూ అటవీఅధికారుల ఆంక్షలు ఇబ్బం దులు సృష్టిస్తున్నాయని వాపోయారు. అట వీప్రాంతంలో పట్టుపురుగుల పెంపకం కొన సాగించకూడదంటూ అటవీ ప్రాంతంలోకి వెళ్లేదారిని మూసివేయడంతో రైతులం ఇబ్బందులు పడుతున్నామన్నారు. తాము ఇబ్బందులు పడుతు న్నామని అధికారులకు మొరపెట్టు కున్నా స్పందిం చడం లేదన్నారు. తమ సమస్య పరిష్కరించేంత వరకు రాస్తారోకో విరమించమని పేర్కొన్నారు. దీంతో ఎటు వాహనాలు అటే నిలిచిపోయాయి. వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. కలెక్టర్‌ వచ్చేంత వరకు లేచేది లేదు అంటూ భీష్మించుకు కూర్చున్నారు. వివిధ సంఘాల నాయకులు రైతులకు మద్దతు తెలిపారు. విషయం తెలుసుకున్న సీఐ బన్సీలాల్‌, ఎస్‌ఐ శ్యామ్‌పటేల్‌ అక్కడికి చేరుకుని సంబంధిత ఉన్నతాధి కారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషిచేస్తామని చెప్పడంతో రైతులు రాస్తారోకో విరమించారు.

Updated Date - Oct 28 , 2026 | 11:53 PM