Share News

Mancherial: సత్యదేవుడి సన్నిధిలో శ్రావణ సందడి

ABN , Publish Date - Aug 23 , 2026 | 11:42 PM

దండేపల్లి, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): పవిత్ర శ్రావణ శుద్ధ ఏకాదశి పురస్కరించుకుని

Mancherial: సత్యదేవుడి సన్నిధిలో శ్రావణ సందడి

దండేపల్లి, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): పవిత్ర శ్రావణ శుద్ధ ఏకాదశి పురస్కరించుకుని దండేపల్లి మండలం గూడెం శ్రీసత్యనారాయణస్వామి దేవాలయంలో ఆదివారం భక్తులతో సందడి నెలకొంది. ఆదివారం సెలవు దినం కావడంతో ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. ఉదయం నుంచే వందలాది మంది భక్తులు తరలివచ్చి సత్యదేవున్ని దర్శించుకున్నారు. ముందుగా పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి గంగమ్మతల్లికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయానికి చేరుకొని సత్యనారాయణస్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. 160మందికి పైగా భక్తులు కుటుంబ సమేతంగా సత్యనారాయణస్వామి వ్రతాలను నోముకున్నారు.

Updated Date - Aug 23 , 2026 | 11:42 PM