Share News

Mancherial: గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకం

ABN , Publish Date - Aug 06 , 2026 | 12:03 AM

కాసిపేట, ఆగస్టు 5 (ఆంధ్ర జ్యోతి): గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమని అదనపుకలెక్టర్‌ చంద్రయ్య అన్నా రు. బుధవారం మండలపరిషత్‌ కార్యాలయంంలో

 Mancherial:  గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకం

కాసిపేట, ఆగస్టు 5 (ఆంధ్ర జ్యోతి): గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమని అదనపుకలెక్టర్‌ చంద్రయ్య అన్నా రు. బుధవారం మండలపరిషత్‌ కార్యాలయంంలో నిర్వహించిన సమీక్ష సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. గ్రామాల అభివృద్ధి, పంచాయతీకి రాబడి పెరగాలంటే వీబీజీరాంజీ పను లను వేగవంతంగా పూర్తిచేయాలన్నా రు. పంచాయతీభవనాలు, గ్రామైక్య సంఘం భవనాలతోపాటు అంగన్‌వాడీ భవనాలను సకాలంలో నిర్మించి పూర్తిచే యాలన్నారు. ప్రతిరోజు పారిశుధ్య్ద కార్య క్రమాలను చేపట్టి పరిసరాల పరి శుభ్రంగా ఉంచేలా సర్పంచులు, కార్యద ర్శులు సమష్టిగా పనిచేయాలన్నారు. కార్యదర్శులు విధుల్లో నిర్లక్ష్యంచేస్తే శాఖాపరమైన చర్యలుంటాయన్నారు. కాగా పంచాయతీకార్యదర్శులు సమావే శంలో ఉండకూడదని పెద్దనపల్లి సర్పం చు కల్వల శరత్‌ అభ్యంతరం తెలిపారు. దీంతో కార్యదర్శులు బయటకు వెళ్లి నిరసన తెలిపారు. తమను అవమానిం చారని మండల ప్రత్యేకాధికారి రాజేశ్వ రికి, ఎంపీడీవోకు వినతిపత్రం అందిం చారు. అనంతరం సమావేశంలో కార్యద ర్శులుకూడా ఉండాలని చెప్పడంతో వారు ఆందోళన విరమించారు. మండల ప్రత్యేకాధికారి రాజేశ్వరి, ఎంపీడీవో సత్య నారాయణసింగ్‌, తహసీల్దార్‌ సునీల్‌ కుమార్‌ దేశ్‌పాండే, ఎంపీవో సప్దర్‌ఆలీ, బెల్లంపల్లి మార్కెట్‌కమిటీచైర్మన్‌ రత్నం సుకుమారి, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు పాల్గొన్నారు.

Updated Date - Aug 06 , 2026 | 12:03 AM