Share News

Mancherial: లక్షెట్టిపేటలో శరవేగంగా రోడ్డు విస్తరణ పనులు

ABN , Publish Date - Jul 15 , 2026 | 11:55 PM

లక్షెట్టిపేట, జూలై 15 (ఆంధ్రజ్యోతి): వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్పరాల కోసం లక్షెట్టిపేట మున్సిపాలిటిలో రోడ్డు విస్తరణ పను లు శరవేగంగా సాగుతున్నాయి.

Mancherial: లక్షెట్టిపేటలో శరవేగంగా రోడ్డు విస్తరణ పనులు

లక్షెట్టిపేట, జూలై 15 (ఆంధ్రజ్యోతి): వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్పరాల కోసం లక్షెట్టిపేట మున్సిపాలిటిలో రోడ్డు విస్తరణ పను లు శరవేగంగా సాగుతున్నాయి. ఉత్కూర్‌ చౌరస్తానుంచి పాతబస్టాండ్‌ వరకు రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా 80ఫీట్లు రోడ్డును చేయనున్నట్లు అధికారులు స్థానికులకు, వ్యాపా రులకు వెల్లడించారు. వ్యాపారులు రోడ్డు మధ్య నుంచి 40ఫీట్లు వరకు ఉన్న నిర్మాణాలను స్వచ్ఛందంగా తొలగించుకోవాలని పలుమార్లు చెప్పినప్పటికీ కొంత మంది మినహా మిగితా వాళ్లు తొలగించకపోవడంతో బుధవారం మున్సి పల్‌అధికారులు తొలగించేందుకు సిద్ధమ య్యారు. సూమారు 100మంది పోలీసుల బందోబస్తు మధ్య ఉదయం 6గంటల నుంచే భారీ ఎక్స్‌కా వేటర్‌లతో కొన్ని బిల్డింగులను కూల్చివేశారు. సమాచారం తెలుసుకున్న వ్యాపారులు, ఇంటి యజమానులు పెద్ద సంఖ్యలో రోడ్డుపైకి వచ్చి వారంరోజులు గడువు ఇవ్వాలని, మున్సిపల్‌ కమిషనర్‌, రెవెన్యూఅధికారులు, పోలీసులను కలిసి ప్రాధేయపడ్డారు. సరైనకొలతలు చెబితే వారం రోజుల్లో స్వచ్ఛందంగా తొలగించుకుంటామని బతిమాల డంతో అధికారులు కూల్చివేతను నిలిపివేశారు. ఈ సంద ర్భంగా కమిషనర్‌ విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ వారం రోజుల్లో అక్రమనిర్మాణాలు తొలగించుకోనిఎడల తొలగి స్తామని, ప్రజలను నష్టపెట్టకూడదని సదుద్దేఽశంతో ప్రస్తు తానికి నిర్మాణాలు తొలగింపు నిలిపివేస్తున్నామన్నారు. వారం తర్వాత మళ్లీ నిర్వహిస్తామని వెల్లడించారు.

Updated Date - Jul 15 , 2026 | 11:55 PM