Share News

Mancherial: సర్‌ పేరిట ఓట్లను తొలగిస్తే సహించేది లేదు

ABN , Publish Date - Oct 01 , 2026 | 11:31 PM

నస్పూర్‌, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): సర్‌ పేరిట ఓటర్లను తొల గిస్తే సహించేది లేదని వామపక్షపార్టీ నాయకులు హెచ్చరించారు. నస్పూర్‌ లోని కలెక్టరేట్‌ ఎదుట వామపక్ష పార్టీల నాయకుల ఆధ్వర్యంలో గురు వారం ఽధర్నా నిర్వహించి అధికారికి వినతిపత్రం అందించారు.

 Mancherial:   సర్‌ పేరిట ఓట్లను తొలగిస్తే సహించేది లేదు

- కలెక్టరేట్‌ ఎదుట వామ పక్ష పార్టీల ధర్నా

నస్పూర్‌, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): సర్‌ పేరిట ఓటర్లను తొల గిస్తే సహించేది లేదని వామపక్షపార్టీ నాయకులు హెచ్చరించారు. నస్పూర్‌ లోని కలెక్టరేట్‌ ఎదుట వామపక్ష పార్టీల నాయకుల ఆధ్వర్యంలో గురు వారం ఽధర్నా నిర్వహించి అధికారికి వినతిపత్రం అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ సర్‌ పేరిట ఓటర్ల తొలగింపును నిలిపివేయాల న్నారు. ఓటుహక్కును హరిస్తే సహిం చేది లేదని ఈ సందర్భంగా హెచ్చ రించారు.

సీఈసీ జ్ఞానేష్‌ కుమార్‌ను బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఆందోళనలో సీపీఎం రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యుడు పైళ్ల ఆశయ్య, సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ జిల్లాకార్యదర్శి లాల్‌కుమార్‌, సీపీఐ కార్యదర్శి లక్ష్మన్‌తో పాటు సీపీఐ, సీపీఐ(ఎంఎల్‌), సీపీఎం వామ పక్షపార్టీ నాయకులు జోగుల మల్లయ్య, లింగం రవి, గోమాస ప్రకాష్‌, బొడెంకి చందు, శ్రీనివాస్‌, లింగయ్య, ఖలీందర్‌ అలీఖాన్‌, రాజేశ్వర్‌రావు, సమ్మయ్య, బ్రహ్మనందం, దొండ ప్రభాకర్‌, దుంపల రంజిత్‌ కుమార్‌, దేవి పోచన్న, అశోక్‌, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను తొలగించాలి ..

బెల్లంపల్లి : ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్వర్‌ కుమార్‌ను విధులనుంచి వెంటనే తొలగించాలని వామపక్ష కమ్యూనిస్టు పార్టీల నాయకులు పేర్కొన్నారు. గురువారం బెల్లంపల్లి పట్టణంలోని సబ్‌ కలెక్టర్‌ కార్యా లయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు దాగం మల్లేష్‌, ఆడపు రాజమౌళి, పసులేటి వెంకటేష్‌ మాట్లాడుతూ భారతరాజ్యాంగం ప్రతి అర్హత కలిగిన పౌరునికి ఎన్నికల్లో ఓటుహక్కును కల్పించింద న్నారు. అయితే ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పేరుతో చేపడుతున్న ప్రక్రియలో అర్హత కలిగిన అనేక మంది ఓటర్లపేర్లు జాబితా నుంచి తొలగించబ డ్డాయన్నారు. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పత్రాల సమర్పణ, ధ్రువీకరణ, చిరు నామా మార్పులు, వలసలు, సాంకేతిక సమస్యలు తదితర కారణాలతో అర్హులైన ఓటర్లు తమ ఓటుహక్కును కోల్పోయే ప్రమాదం ఉందన్నారు.వెంటనే ఎన్నికల కమిషనర్‌ రాజీనామా చేయాలని లేనియెడల పెద్దఎత్తున ఆందోళనలు చేస్తామన్నారు. అనంతరం సబ్‌కలెక్టర్‌కు వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో నాయకులు శ్రీకాంత్‌రెడ్డి, చరణ్‌, సోని, భూమయ్య, తికల్‌, బాబు, లక్ష్మీనారాయణ, బానేష్‌, చంద్ర మాణిక్యం, సమ్మయ్య, ప్రహ్లాద్‌, రమేష్‌, తిరుపతి, మహేందర్‌రెడ్డి, రాజేందర్‌, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 01 , 2026 | 11:31 PM