Mancherial: గణనాథుని ఆశీస్సులతో వర్షాలు
ABN , Publish Date - Sep 23 , 2026 | 11:26 PM
మందమర్రిటౌన్, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గణనాధుని ఆశీ స్సులతో వర్షాలు కురుస్తున్నాయని మంత్రి వివేక్‌వెంకటస్వామి అన్నారు.
మందమర్రిటౌన్, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గణనాధుని ఆశీ స్సులతో వర్షాలు కురుస్తున్నాయని మంత్రి వివేక్‌వెంకటస్వామి అన్నారు. బుధవారంరాత్రి ఆయన మండలంలో ఊరేగింపుగా నిమజ్జనానికి వెళ్తున్న గణ నాథులను దర్శించుకున్నారు. మహిళ లతోకలిసి కోలాటం ఆడారు. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ చెన్నూరు నియోజ కవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తు న్నానన్నారు. హిందూ ఉత్సవసమితి నాయకులు నిమజ్జన ఏర్పాట్లను ఘనం గా చేయడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం మంత్రిని ఘనంగా సన్మానిం చారు. క్యాతనపల్లి, రామకృష్ణాపూర్‌లోని గణపతి మండపాల్లో వినాయకునికి పూజలు నిర్వహించారు. నిమజ్జనంలో పాల్గొన్నారు. నాయ కులు మంద తిరుమ ల్‌రెడ్డి, గణేష్, జావే ద్‌ఖాన్, విజయ్, నర్సయ్య, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
జైపూర్ : చెన్నూ రు నియోజకవర్గం లోని ప్రజలు సుఖ శాంతులతో వర్ధిల్లా లని మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొ న్నారు. బుధవారం జైపూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన వినాయకున్ని ఆయన దర్శించుకుని పూజలు చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు చల్ల విశ్వంభర్‌రెడ్డి, సర్పంచు కూనభాస్కర్, నాయకులు సంపత్‌రెడ్డి, రిక్కుల శ్రీనివాస్‌రెడ్డి, మంతెన లక్ష్మణ్, రవి తదితరులు పాల్గొన్నారు.