Mancherial: ప్రజాస్వామ్యం మీద గౌరవం లేని నేత రాహుల్‌గాంధీ
ABN , Publish Date - Jul 22 , 2026 | 11:48 PM
మంచిర్యాల కలెక్టరేట్, జూలై 22 (ఆంధ్రజ్యోతి): ప్రజాస్వామ్యం మీద గౌరవంలేని ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ అని బీజేపీజిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వ ర్‌గౌడ్ పేర్కొన్నారు.
-బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్
మంచిర్యాల కలెక్టరేట్, జూలై 22 (ఆంధ్రజ్యోతి): ప్రజాస్వామ్యం మీద గౌరవంలేని ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ అని బీజేపీజిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వ ర్‌గౌడ్ పేర్కొన్నారు. బుధవారం ఐబీ చౌరస్తాలో రాహు ల్‌గాంధీ చిత్రపటాన్ని దహనం చేసి నిర సన వ్యక్తం చేశారు. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ పార్లమెంట్ లో నీట్‌ప్రశ్నపత్నం లీకేజీ విష యంలో చర్చజరపడానికి సిద్ధ మని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ వినకుండా ప్రధాని ఇంటిముందు ధర్నాచేసి రాహుల్‌గాంధీ ప్రజా స్వామ్యాన్ని అపహాస్యం చేశారని పేర్కొన్నారు. పార్ల మెంట్‌సభ్యుడు వంశీ దేశప్రధానిని విధ్వంసం సృష్టించే వ్యక్తిగా చిత్రీకరించడం అతనికి రాజకీయ పరిణితి లేదన్న విషయాన్ని తెలియజేస్తుంద న్నారు. కార్యక్రమంలో నాయకులు రాజ్‌కుమార్, పురు షక్షత్తం, వెంకటకృష్ణ, స్వప్నరాణి, సుజాత, ప్రేమ్‌సింగ్, మధు, శ్రీధర్, శ్రీనివాస్, రాజమౌళి, సురేష్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.
రాహుల్‌గాంధీ దిష్టిబొమ్మ దహనం
లక్షెట్టిపేట: లక్షెట్టిపేటలోని ఊత్కూర్ చౌరస్తాలో బీజేపీనాయకులు బుధవారం రాహుల్‌గాంధీ దిష్టి బొమ్మను దహనం చేశారు. బీజేపీరాష్ట్ర ఉపాధ్యక్షుడు రఽఘునాథ్ వెరబెల్లి మాట్లాడుతూ లోక్‌సభ ప్రతి పక్షనేత రాహుల్‌గాంధీ లోక్‌సభలో చర్చలో పాల్గొన కుండా నీట్‌పేపర్ ముసుగులో దేశంలో అలజడి సృష్టిస్తున్నారన్నారు. ప్రధానిమోదీ ఇంటివద్ద ధర్నా చేపట్టడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. కార్యక్ర మంలో బీజేపీపట్టణ అధ్యక్షుడు హరిగోపాల్‌రావు, మండలఅద్యక్షుడు హేమంత్ రెడ్డి, పెద్దపల్లి పురు షోత్తం, బొప్పుకిషన్, గెండ ప్రభాకర్, వేములమధు, సామరమణ,రాజేందర్,చంద్రమౌళి, సతీష్,రాజేశ్వర్, రవి, గురువయ్య, గంగన్న, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.