Mancherial: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
ABN , Publish Date - Jul 15 , 2026 | 11:57 PM
కాసిపేట, జూలై 15 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన భోజనం అందించాలని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు.
-కలెక్టర్ కుమార్ దీపక్
కాసిపేట, జూలై 15 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన భోజనం అందించాలని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. బుధవారం కాసిపేటలోని కస్తూర్బాగాంధీ విద్యాలయాన్ని ఆయన తనిఖీచేశారు. భోజ నాన్ని పరిశీలించి తగు సూచ నలు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ వంటకు ఉపయోగించే నిత్యావసరసరుకులు, కూరగా యలు నాణ్యమైనవి వాడాలన్నారు. మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. అనం తరం అదనపు తరగతిగదులు, భోజనశాల, మూత్రశాలల, మరుగు దొడ్ల నిర్మాణపను లను పరిశీలించి త్వరగా పూర్తిచేయాలన్నారు. విద్యా ర్థులు ఉత్తమఫలితాలు సాధించేలా ఉపా ధ్యా యులు కృషిచేయాలన్నారు. ఆయనవెంట కేజీ బీవీ ఎస్‌వో సరిత, ఉపాధ్యాయులు ఉన్నారు.