Mancherial: కలెక్టరేట్ ఎదుట వివిధ సంఘాల ధర్నాలు
ABN , Publish Date - Aug 24 , 2026 | 11:48 PM
నస్పూర్, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి) : కలెక్టరేట్ ప్రాంగణం సోమవారం ఆందోళనలు, ధర్నాలతో మార్మో గింది. పాలిటెక్నిక్ విద్యార్థులకు నష్టం కలిగించే జీవో నంబరు97ను రద్దు చేయాలని బీఆర్‌ఎస్, ఏఐఎస్‌బీ నాయకులు, విద్యార్థులు, హమాలీకార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని సీఐటీయూ ఆధ్వర్యంలో హమాలీలు ఆందోళన చేపట్టారు.
నస్పూర్, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి) : కలెక్టరేట్ ప్రాంగణం సోమవారం ఆందోళనలు, ధర్నాలతో మార్మో గింది. పాలిటెక్నిక్ విద్యార్థులకు నష్టం కలిగించే జీవో నంబరు97ను రద్దు చేయాలని బీఆర్‌ఎస్, ఏఐఎస్‌బీ నాయకులు, విద్యార్థులు, హమాలీకార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని సీఐటీయూ ఆధ్వర్యంలో హమాలీలు ఆందోళన చేపట్టారు.
జీవోనంబరు 97 రద్దు చేయాలని
విద్యార్థి సంఘాలు..
ప్రభుత్వం పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్‌ను నాశనం చేసే జీవోను రద్దు చేసే వరకు విద్యార్థులకు అండగా ఆందోళన చేస్తామని బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయ కుడు నడిపెల్లి విజిత్‌కుమార్ అన్నారు. గతంలో విద్యా ర్థులు పాలిటెక్నిక్ చదివిన తర్వాత ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్‌లో నేరుగా జాయిన్ అయ్యేవారు, కానీ జీవో 97 ద్వారా పాలిటెక్నిక్ విద్యార్థులు ఇంజనీరింగ్‌లో చేరాలంటే మళ్లీ ఇంటర్ చదవాలన్నారు. దీనిద్వారా విద్యార్థులకు సమయం వృధా అవుతుందని, పైగా ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. ముఖ్యమంత్రి విద్యార్థుల భవిష్య త్‌ను దృష్టిలో పెట్టుకుని జీవో97ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనలో దగ్గుల మధు, శ్రావణ్, కాటం రాజు, హైమద్, కందుల ప్రశాంత్, బానుచందర్, సోహెల్, తిరుపతి, సాయి తదితరులు పాల్గొన్నారు.
పాలిటెక్నిక్ విద్యను కాపాడాలని అఖిల భారత విద్యాఽర్థి బ్లాక్(ఏఐఎస్‌బి) నాయకులు డిమాండ్ చేశారు. జీవోనంబరు 97ను రద్దు చేయాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నివాదాలు చేశారు. పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మంచిర్యాల విద్యాధికారి పోస్టును వెంటనే రెగ్యులర్ చేయాలన్నారు. ఆందోళనలో ఏఐఎస్‌బి జిల్లా అధ్యక్షుడు జతిన్‌గౌడ్, సాయిచరణ్, మోహిన్, అఖిల్, రామ్ చరణ్, ఈశ్వర్, ఓంకార్, విద్యార్థులు పాల్గొన్నారు.
వెల్ఫేర్‌బోర్డు ఏర్పాటు చేయాలని హమాలీలు..
హమాలీకార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా హమాలీవెల్ఫేర్ బోర్డును ఏర్పాటుచేయాలని ఆల్ హమాలీవర్కర్స్ యూనియన్(సీఐటీయూ) జిల్లా అఽధ్య క్షుడు గోమాసప్రకాష్ డిమాండ్ చేశారు. హమాలీలంద రికి హెల్త్‌కార్డులు జారీచేయాలన్నారు. ఆరువేల రూపా యల పెన్షన్ ఇవ్వాలన్నారు. ఇందిరమ్మ పథకం కింద స్థలాలు ఇవ్వాలన్నారు. పనిస్థలాల్లో మంచినీరు, విశ్రాంతిగదులు, మరుగుదొడ్లు, సైకిల్ స్టాండ్, ప్రథమ చికిత్స వంటి వసతులను కల్పించాలన్నారు. ఆందోళనలో సీఐటీయూ జిల్లాకార్యదర్శి దుంపల రజింత్ కుమార్, నాయకులు సురేందర్, చిన్నయ్య, శేఖర్, గంగన్న, చందు, బీమసేను, తిరుపతి, చంద్రయ్య, కొమురయ్య, మల్లేష్, శ్రీనివాస్, పోషం, కృష్ణమాచారి, రాములు, ప్రేమ్ కుమార్, విష్ణు, మొగిలి, రాజు, నగేష్, రవి, భీమరావు, ప్రమోద్ పాల్గొన్నారు.