Mancherial: బస్‌స్టాప్ వరకు బస్సులు నడపాలని ధర్నా
ABN , Publish Date - Nov 12 , 2026 | 11:26 PM
నెన్నెల, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ బస్సులు నెన్నెల సెంటర్‌లోని బస్టాప్ (అంబేద్కర్ స్టాచ్యూ) వరకు నడపాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ నాయకులు గురు వారం రాస్తారోకో చేశారు.
నెన్నెల, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ బస్సులు నెన్నెల సెంటర్‌లోని బస్టాప్ (అంబేద్కర్ స్టాచ్యూ) వరకు నడపాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ నాయకులు గురు వారం రాస్తారోకో చేశారు. సర్పంచ్ ఎండీ ఇబ్రాహీం ఆధ్వర్యంలో కుశ్నపల్లి ఎక్స్‌రోడ్డు వద్ద రోడ్డుపై బైఠాయించారు. ఈ సంద ర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ కొందరు ఆర్టీసీ సిబ్బంది కావాలని లోపలికి రాకుండా మేయిన్‌రోడ్డుపై నుంచే వెనుదిరిగి పోతు న్నారని అన్నారు. దీంతో వృద్ధులు, మహి ళలు, పిల్లలు ఇబ్బందులు పడు తున్నారని అన్నారు. సెంటర్ నుంచి కుశ్నపల్లి ఎక్స్‌రోడ్ వరకు కాలినడక రావాల్సి వస్తోందన్నారు. దశాబ్దాల నుంచి లేని సమస్య డ్రైవర్లకు ఇప్పుడేం వచ్చిందని ప్రశ్నిం చారు. ఎస్సై జగదీశ్వర్‌రెడ్డి అక్కడికి చేరుకొని ఆర్టీసీ అధి కారులతో మాట్లాడి బస్సులు బస్టాప్ వరకు వెల్లేలా చూస్తా మని హామీ ఇవ్వడంతో ఆందో ళన విరమించారు. కార్యక్ర మంలో ఉపసర్పంచ్ కీసరి సంతోష్, మాజీ ఉపసర్పంచ్ గడ్డం స్వామి గౌడ్, నాయకులు అంజన్న గౌడ్, కృష్ణస్వామి, తిరుమల్, రాము, ఆశన్న, తాజ్, తదితరులు పాల్గొన్నారు.