Share News

Mancherial: నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యం ఇవ్వాలి

ABN , Publish Date - Nov 04 , 2026 | 11:58 PM

దండేపల్లి, నవంబరు 4 (ఆంద్రజ్యోతి): ఎల్‌నినో ప్రభా వంతో నీటి ఎద్దడి ఏర్పడే అవకాశాలున్నందున ముందస్తు నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్‌(స్థానిక సంస్థలు) చంద్రయ్య అన్నారు.

Mancherial:  నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యం ఇవ్వాలి
గూడెం గోదావరి వద్ద పుష్కరఘాట్‌ నిర్మాణ పనులను పరిశీలిస్తున్న అదనపు కలెక్టర్‌ చంద్రయ్య

దండేపల్లి, నవంబరు 4 (ఆంద్రజ్యోతి): ఎల్‌నినో ప్రభా వంతో నీటి ఎద్దడి ఏర్పడే అవకాశాలున్నందున ముందస్తు నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్‌(స్థానిక సంస్థలు) చంద్రయ్య అన్నారు. బుధ వారం మండలంలో ఎనిమిది గంటలపాటు ఆయన సుడి గాలి పర్యటన నిర్వహించి పలు అభివృద్ది పనులను పరిశీలించారు. వర్షపు నీటిని ఒడిసిపట్టేలా ఇంకుడు గుంతలు, వ్యవసాయ కుంట లు, నీటికుంటలు, నీటితొట్టేలు, కందకాల నిర్మించాలని అధికారులకు దిశానిర్ధేశం చేశారు. రెబ్బనపల్లిలో వీబీ జీరాంజీ కింద చేపడుతున్న వ్యవసాయకుంట పను లను, యంగ్‌ ఇండియా పాఠశాల నిర్మాణ పనులను పరిశీలించి పనులను నాణ్యతతో గడువులోగా పూర్తి చేయాలన్నారు. ముందుగా గూడెం గోదావరి వద్ద నిర్మిస్తున్న పుష్కరఘాట్‌ నిర్మాణ పనులు, వాటి పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నిర్ధేశిత గడువులోగా పూర్తిచేయాలన్నారు. అనంతరం గూడెం ప్రభుత్వ ఉన్నతపాఠశాలను సందర్శించి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని పరిశీలించారు. లింగాపూర్‌లో తాగునీటి సమస్యతీవ్రంగా ఉందన్న సమాచారంతో వెంటనే మిషన్‌భగీరథ అధికారులకు ఫోన్‌చేసి సమ స్యను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. లింగా పూర్‌లో కూలీలతో ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

అనంతనం దండేపల్లి ఎంపీడీవో కార్యలయంలో మెట్లశిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. వీబీజీ రాంజీ కింద ఉన్న వివిధరకాల పనులను ఉపయోగించుకోవా లన్నారు. ఆయనవెంట ఎంపీడీవో ప్రసాద్‌, మిషన్‌భగీరథ అసిస్టెంట్‌ ఇంజనీర్‌ అచ్యుత్‌, ఎంపీవో విజయప్రసాద్‌, ఏపీవో దుర్గప్రసాద్‌, ఈసీ భీమయ్య, టీఏలు జగన్‌, అరవింద్‌ వివిధ శాఖల అధికారులు, సిబ్బంది కూలీలు పాల్గొన్నారు.

Updated Date - Nov 05 , 2026 | 12:03 AM