Mancherial: అన్నిశాఖల సమన్వయంతోనే రోడ్డు ప్రమాదాల నివారణ
ABN , Publish Date - Aug 06 , 2026 | 12:01 AM
మంచిర్యాలక్రైం, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదాల నివారణ అన్ని శాఖల సమన్వయంతోనే సాధ్యమని రామగుండం పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు.
రామగుండం సీపీ అంబర్‌కిషోర్‌ఝా
మంచిర్యాలక్రైం, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదాల నివారణ అన్ని శాఖల సమన్వయంతోనే సాధ్యమని రామగుండం పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. బుధవారం కమిషన రేట్‌లో రవాణశాఖ, ట్రాఫిక్ పోలీసు అధికా రులతో కలిసి సమన్వయ సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ రవాణశాఖ(ఆర్‌టీఏ), ట్రాఫిక్ పోలీ సులు సమన్వయంతో పనిచేయాలన్నారు. నిబంధనలు పాటించని డ్రైవర్లు, యజమా నులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్యాసింజర్ వాహనాల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించరాదన్నారు. హెల్మెట్ ధరించాలని, సీటుబెల్ట్ ధరించ కుండా వాహనాలు నడపడం, నంబరులేని వాహనాలు, మైనర్లచే వాహనాలు నడిపిం చడం, రాంగ్‌డ్రైవింగ్, ట్రిపుల్‌రైడింగ్, రాంగ్ రూటు డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్ వంటి, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై రాజీ లేకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవా లని ఆదేశించారు. రోడ్డు ప్రమాద బాధితు లకు సకాలంలో సహాయం అందించే రహ్‌వీర్ పథకం, ప్రమాదాలు జరిగిన మొదటి అత్యంత కీలకమైన గోల్డెన్‌అవర్ ప్రాముఖ్యతపై వాహనదారులకు ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో ఏసీపీ శ్రీనివాస్, మంచిర్యాల డీటీవో గోపిక్రిష్ణ, ట్రాఫిక్ సీఐ రాజేశ్వర్‌రావు, శ్రీనివాస్, ట్రాఫిక్‌సీఐ హనన్, వెహికిల్ ఇన్‌స్పెక్టర్ లక్ష్మణ్ పాల్గొన్నారు.
గంజాయి, మత్తుపదార్థాలపై
ఉక్కుపాదం..
గంజాయి, మత్తుపదార్థాలు విక్రయించిన వారిపై కఠినచర్యలు తీసుకొని కేసులు నమోదు చేస్తామని రామగుండం పోలీసు కమిషనర్ అంబర్‌కిషోర్ ఝా అన్నారు. మంచిర్యాల, పెద్దపల్లి జోన్ పరిధిలో ఇప్పటివరకు 81ఎన్‌డీపీఎస్ కేసుల్లో నింది తులనుంచి 40173ఎండు గంజాయితో పాటు 26గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకుని వాటిని దహనం చేశామన్నారు. గంజాయి అమ్మినా లేదా విక్రయించినా, రవాణా, నిల్వచేసినా కఠినచర్యలు తీసు కుంటామని హెచ్చరించారు.
అవసరమైతే పీడీయాక్ట్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కార్యక్ర మంలో పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి, అడిషనల్ డీసీపీ అడ్మిన్ కే శ్రీనివాస్, ఏసీపీలు ఎం రమేశ్, వెంకటేశ్వర్లు, నాగేంద్రగౌడ్, సీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ అనిల్, ఎస్‌ఐ వినీత పాల్గొన్నారు.